NTV Telugu Site icon

KTR : ఆరు నెలల్లో తెలంగాణలో మళ్ళీ కేసీఆర్.. కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు..

Ktr

Ktr

రేవంత్ రెడ్డి వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అని మోసం చేశారని, ఊసరవెల్లి రంగులు మార్చినట్టుగా రేవంత్ రెడ్డి డేట్లు మారుస్తున్నాడని ఆరోపించారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇవాళ ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ లో 10 ,12 సీట్లు మాకు ఇవ్వండని కోరారు. ఆరు నెలల్లో తెలంగాణ లో మళ్ళీ కేసీఆర్‌.. రాష్ట్ర రాజకీయాల్లో చక్రం తిప్పుతారని సంచలన వ్యాఖ్యలు చేశారు. నమో అంటే నమ్మించి మోసం చేసే టోడు అని ఆయన అభివర్ణించారు. 2 కోట్ల మంది కి ఉద్యోగాలు ఇస్తా న్నారు.ఇచ్చారా.. రైతుల ఆదాయం డబల్ అయిందా అని ఆయన అన్నారు. రేవంత్ రెడ్డి పార్లమెంటు కు ఒక్క జిల్లా అంటున్నారని, నిర్మల్ జిల్లా ఉండాలంటే బీ ఆర్ ఎస్ కు ఓటు వేసి గెలిపించాలన్నారు. దేవుడు పేరు చెప్పి ఓట్లు అడగడం పెద్ద ముచ్చ లేదని, మతం పేరుతో రెచ్చ గొట్టడం తప్పా.. చేసేదేమి లేదన్నారు.

అంతేకాకుండా.. ‘జన బలం ఉంటే ఎవ్వరు ఎం చేయలేరు. పిచ్చోడి చేతిలో రాయిలా మారింది రేవంత్ రెడ్డి పరిస్థితి. ఫ్రీ బస్సు పెట్టాక 40 మంది ఎక్కే బస్సులో 60 మంది ని కూర్చో బెట్టారుతున్నారు. జేబు దొంగలు ఎక్కువ అయ్యారు. జేబుల కత్తెర పెట్టుకొని రేవంత్ రెడ్డి తిరుగుతున్నాడు. పిచ్చొల్ల చేతిలో రాష్ట్రం ఉంది. పదేళ్ల క్రితం మోడీ అధికారంలోకి వచ్చేటప్పుడు 150 హామీలు ఇచ్చారు. సబ్ కా సాత్ సబ్ కా వికాస్ ఎక్కడ మోడీ..? మేకిన్ ఇండియా లేదు.. వికసిత్ భారత్ కాలేదు.. కానీ విఫల్ భారత్ ఐంది. కరీంనగరోళ్లకు 15 లక్షల నల్లధనం మీ ఖాతాల్లో పడ్డయా..? బండి సంజయ్ తెచ్చి ఇచ్చిండట కదా..? మోడీది ఎమోషనల్ బ్లాక్ మెయిల్. మోడీ హయాంలో రూపాయి విలువ పడిపోయింది. ఢిల్లీలో రైతులు ధర్నా చేస్తే 750 మంది రైతులను పొట్టనబెట్టుకున్నాడు. కార్పోరేట్లకు లక్షల కోట్లు మాఫీ చేశాడు తప్ప.. సామాన్యులకు న్యాయం చేయలే.

 

మోడీ హయాంలో దేశం తిరోగమన దిశలో పయనిస్తోంది. చట్టాన్ని కూడా ఉల్లంఘించిన మోడీ ఒక్కటంటే ఒక్క నవోదయ స్కుల్ ఇవ్వలే. పోయినసారి మంచికో చెడ్డకో బీజేపీ తరపున నల్గురు గెలిస్తే రూపాయి లాభం జరిగిందా..? కరీంనగర్ స్మార్ట్ సిటీ చేసిందే వినోద్ కుమార్. కరీంనగర్ ను సుందరంగా తీర్చిదిద్దింది గంగుల కమలాకర్. బండి సంజయ్ గట్టిగా అరిస్తే అది తెలుగా, ఇంగ్లీషా, హిందీనా మనకే అర్థం కాదు. మరలాంటి ఆయన్ను పార్లమెంట్ కు పంపుదామా? కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపి అధికారంలోకి వచ్చారు. ఆరు గ్యారంటీలు పొన్నం ప్రభాకర్ తెచ్చి ఇచ్చిండా..? అంతా గ్యాసే వాళ్ల మాటలు. మేం 30 వేల కోట్ల రూపాయలతో రెండు విడతల్లో రుణమాఫీ చేశాం. కాంగ్రెస్ హయాంలో ఏదన్నా అమలవుతుందా..?. కాంగ్రెస్ పాలన ధోఖాబాజ్. మహిళలకు ఫ్రీ బస్సులో సర్కస్ లా కొట్టుకుంటున్నారు.’ అని కేటీఆర్‌ అన్నారు.