NTV Telugu Site icon

KTR : కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనై

Ktr

Ktr

వరంగల్ హంటర్ రోడ్డు లోని నాని గార్డెన్‌లో ఏర్పాటు చేసిన వరంగల్ ఈస్ట్ నియోజకవర్గం పట్టభద్రుల ఉప ఎన్నిక సన్నాహక సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. రైతు బిడ్డ, చదువుకున్న యువకుడు మన భారాస ఎమ్మెల్సీ అభ్యర్థి…. మహిళల మెడలో తాళిబొట్టు కొట్టేసే అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అని ఆయన అన్నారు. కాంగ్రెస్ పార్టీ అరచేతిలో వైకుంఠం చూపించి.. అధికారంలోకి వచ్చారని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో విద్యుత్ కోతలు మొదలైనవని ఆయన ఆయన పేర్కొన్నారు. నిన్న ఎంజీఎం ఆసుపత్రిలో 5గంటలు విద్యుత్ నిలిపోయిందని, 2లక్షల రుణమాఫీ కాలేదని, రైతు బంధు రైతులకు రాలే , కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వాలేనన్నారు. వరికి 500 బోనస్ దక్కాలే… రాష్ట్రంలో మోసాల పరంపర సాగుతుంది, కాంగ్రెస్ నాయకులు పచ్చి మోసగాళ్లు, రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కావాలంటే… రాకేష్ రెడ్డిని గెలిపించాలన్నారు. 420 హామీలతో అధికారంలోకి వచ్చారని, 24 అంతస్తు ఆసుపత్రి నిర్మాణ పనులు నిలిచిపోయాయని, కొత్త పరిశ్రమలను తీసుకువచ్చే స్థాయి కాంగ్రెస్ నాయకులకు లేదన్నారు. ఉన్న కంపెనీలకు కపాడుకునే సత్తా లేని నాయకులు కాంగ్రెస్ నాయకులు, తీన్మార్ మల్లన్న లాంటి నాయకులు గెలిస్తే చట్టసభలు బూతు మాటలకు వేదిక అవుతుందన్నారు కేటీఆర్‌.

అంతేకాకుండా.. ‘ఆరు నెలల క్రిందట చెప్పాము మోస పోకండి అని.. రుణమాపీ చేస్తా అన్నాడు రేవంత్ రెడ్డి ఇంతవరకు చేయలేదు.. రేవంత్ రెడ్డి వచ్చాక రైతు బంధు, ఎలక్షన్స్ వచ్చినప్పుడే గుర్తుకు వస్తుంది… ఎన్నికల ముందు వడ్లకు బోనస్ ఇస్త అన్నాడు… ఇప్పుడేమో కేవలం సన్న వడ్లకే ఇస్తా అంటున్నాడు… కాబట్టి విద్యావంతులారా అలోచించి ఓటు వేయండి.. ఏం జి ఏం హాస్పిటల్ లో 4 గంటలు కరెంట్ లేదు నిన్న, ఒక్క జనరేటర్ కూడా పనిచేయక రోగులు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు… తెలివితక్కువ, సన్యాసీ మన ముఖ్యమంత్రి అయ్యాడు.. మల్లన్న ఒక బ్లాక్ మేలర్, యూట్యూబ్ ఛానల్ పట్టుకొని ఇష్టం ఉన్నట్టు అబద్ధాలు చెప్పే వ్యక్తి… చెంచల్ గూడా క్రిమినల్ మల్లన్న… కాబ్బటి ప్రజలరా అలోంచించండి ఒక విద్యావంతుని గెలిపించండి… ఒక మోసపూరిత వ్యక్తి కీ ఒక క్రిమినల్ కీ ఓటు వేయకండి.. జాబ్ క్యాలెండర్ ఇస్తా ఆనాడు రేవంత్ రెడ్డి ఎటు పోయింది.. ఒక ఉచిత బస్ తప్ప ఎలాంటి పధకాలు హామీ కాలేదు… చాలామంది విద్యావంతులు రాకేష్ రెడ్డి కీ ఓటు వేయమని చెపుతున్నారు.. ఒక రైతు బిడ్డ, గోల్డ్ మేడలిస్ట్ కీ ఓటు వేసి అధిక మెజారిటీ గెలిపించాలని కోరుకుంటున్నాను…’ అని కేటీఆర్‌ అన్నారు.