NTV Telugu Site icon

KTR : పార్లమెంట్ ఎన్నికలు అయ్యాకా కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన బీజేపీలో చేరుతాడు

Ktr

Ktr

రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బీ.ఆర్.ఎస్ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశానికి మాజీ మంత్రి కేటీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తుమ్మిడి, బమ్మిడి చేసి అడ్డగోలుగా అబద్ధాలు చెప్పి 420 హామీలు ఇచ్చి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందన్నారు. సీఎం మెడల పేగులు వేసుకుంటా అని అంటున్నాడు బోటి పేగులు కొడుతున్నాడా ఇప్పటి నుండి రేవంత్ రెడ్డి పేరు పొంగనాలు రేవంత్ రెడ్డి అని  అంటున్నారన్నారు. సీఎం  నువ్వు మోగినివైతే ఇవ్వాళ జివో తీసి రైతులకు, పెంచిన పెన్షన్లు, రైతు బందు ఇవ్వు 500 బోనస్ ఇవ్వు అని ఆయన అన్నారు. పార్లమెంట్ ఎన్నికలు అయ్యాకా కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడిచిన బిజెపిలో చేరుతాడని, కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు అని బిజెపికి వత్తాసు పలుకుతున్నాడన్నారు.

అంతేకాకుండా.. ‘ఇపుడు ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదు సగం బీజేపీ సగం కాంగ్రెస్ పార్టీ. బండి సంజయ్ నీ ఐదు సంవత్సరాలు ఎట్లా బరించినారో కానీ అతను మాత్రం కరీంనగర్ కు గుది బండ సంజయ్. గంభీరావుపేట కు 24 గంటల నీళ్లు ఉండాలని కెసిఆర్  చిరకాల కోరిక,  ఎగువ మానేరు నర్మాల ప్రాజెక్ట్ లో నిత్యం నీళ్లు ఉండేవి ఇప్పుడు అందులో నీళ్లు ఉన్నాయా….? ఎర్రటి ఎండల్లో కూడా కాళేశ్వరం లో రోజుకు ఐదు వేల క్యూసెక్కుల నీళ్లు సముద్రం పాలువుతున్నయి. కేసీఆర్‌ సీఎం అయితే అవి ఒడిసి పట్టి నీళ్లు ఎత్తిపోసెల ఇంజనీర్లు కృషి చేశారు. సీఎం చిత్త శుద్ది ఉంటే కాళేశ్వరం రిపేర్ చేపించి నీళ్లు ఇవ్వు. ప్రజా సమస్యలు కొరకు గొంతు విప్పుతాం కాంగ్రెస్ పార్టీ భరతం పాడుతాం. 100 రోజుల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి చేయకుంటే ప్రజలు మి వీపులు పగలగొడుతారు. కరీంనగర్ పార్లమెంటు కథన భేరి సభ పై కుట్రలు పన్నుతున్నారు. పొలాలు ఎండి పోతే బోనస్ ఇవ్వకుండా కుట్రలు చేస్తున్నాడు ఎండిన పంటలకు 10 వేయాలా బోనస్ ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాను.’ అని కేటీఆర్‌ అన్నారు.