NTV Telugu Site icon

KTR: దుష్ప్రచారాలు చేస్తున్న మీడియా సంస్థలకు హెచ్చరికలు చేసిన కేటీఆర్..

Ktr

Ktr

KTR On X: భారత రాష్ట్ర సమితి విలీనం పోత్తులు మరియు ఇతర దుష్ప్రచారాలు చేస్తున్న వ్యక్తులు, కొన్ని మీడియా సంస్థలకు కేటీఆర్ హెచ్చరికలు చేసారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేసారు కేటీఆర్. బిఆర్ఎస్ పార్టీ పైన నిరాధారమైన దుష్ప్రచారం చేస్తున్న వాళ్లకి కేటీఆర్ హెచ్చరికలు చేసారు. బిఆర్ఎస్ పార్టీ పైన, విలీనం లాంటి ఎజెండా పూరిత దుష్ప్రచారం చేస్తున్న మీడియా సంస్థలు, వ్యక్తులు వెంటనే ప్రజలకి వివరణ ఇవ్వాలి, లేదంటే వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అని., 24 సంవత్సరాలుగా ఇలాంటి అనేక కుట్రలు, కుతంత్రాలు, కుట్రదారులను ఎదుర్కొన్న పార్టీ మాది.. ఇవన్నీ దాటుకొని 24 ఏళ్ల పాటు నిబద్ధతతో పట్టుదలతో అవిశ్రాంతంగా పోరాడి తెలంగాణ సాధించిన పార్టీ బిఆర్ఎస్ అంటూ అన్నారు.

Karan Bhushan Singh: వినేష్ ఫోగట్ అనర్హత వేటుపై బ్రిజ్ భూషణ్ సింగ్ కుమారుడు ఏమన్నారంటే?

సాధించుకున్న తెలంగాణ సగర్వంగా నిలబెట్టుకొని, అభివృద్ధిలో అగ్రప్రదాన నిలిపాము. ఆత్మగౌరవం, అభివృద్ధిని పర్యాయపదాలుగా మార్చుకొని ఇతర రాష్ట్రాలకి ఆదర్శంగా ఉండేలా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాము. కోట్లాది గొంతుకలు, హృదయాలు తెలంగాణ ఆత్మగౌరవం, తెలంగాణ గుర్తింపు కోసం పోరాడుతున్నాయి కాబట్టే ఇది సాధ్యమైంది. ఎప్పటిలానే బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కోసం నిలబడుతుంది.. పోరాడుతుంది.., ఇప్పటికైనా అడ్డగోలు అసత్యాలను దుష్ప్రచారాలని మానుకోవాలి.. పడతాం, లేస్తం, తెలంగాణ కోసమే పోరాడుతాం… కానీ తలవంచం.. ఎన్నటికైనా ఎప్పటికైనా అని కేటీఆర్ అన్నారు.

Show comments