Raghunandan Rao : తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అనుమతించకపోతే, రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రజాప్రతినిధులు కలిసి తిరుమలలో టీటీడీ అధికారులతో తేల్చుకుంటామని మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్ రావు హెచ్చరించారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖల ద్వారా భక్తులకు దర్శన అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన డిమాండ్ చేశారు.
శుక్రవారం తిరుమల శ్రీవారిని వీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన రఘునందన్ రావు, వేసవి సెలవుల్లో అధిక సంఖ్యలో భక్తులు తిరుమలకు వచ్చేందున, తమ సిఫార్సు లేఖల ద్వారా వీరికి దర్శన అవకాశాన్ని కల్పించాల్సిన అవసరం ఉందని చెప్పారు. టీటీడీ బోర్డు ఇప్పటికే ఫిబ్రవరి 1వ తేదీ నుంచి తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను ఆమోదిస్తామని ప్రకటించిందని గుర్తు చేశారు.
అంతేకాకుండా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 294 మంది ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను అంగీకరించిన టీటీడీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఎమ్మెల్యేలకే ఈ సదుపాయాన్ని పరిమితం చేయడం అన్యాయం అని అన్నారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల లేఖలను సమానత్వంతో అంగీకరించాలని, ఎలాంటి వివక్ష చూపకూడదని కోరారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా జోక్యం చేసుకుని, తెలంగాణ ప్రజాప్రతినిధులకు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజాప్రతినిధులతో సమానంగా ప్రాధాన్యత కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.
Bharat Ane Nenu: మహేష్ బాబు ఫ్యాన్స్‌తోనే కామెడీనా?.. ఫైట్‌ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో!