NTV Telugu Site icon

KTR: ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్.. అసలు దెయ్యం అతనే అంటూ..

Ktr Kavitha

Ktr Kavitha

ఎమ్మెల్సీ కవిత కామెంట్స్ కు కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. పార్టీలో అంతర్గత విషయాలు అంతర్గతంగా మాట్లాడితేనే మంచిదని సూచించారు. ఏ హోదాలో ఉన్నా బహిరంగంగా మాట్లాడటం కరెక్ట్ కాదని కేటీఆర్ అన్నారు. ఇది అందరికీ వర్తిస్తుందని కేటీఆర్ క్లారిటీ ఇచ్చారు. మా పార్టీలో ప్రజాస్వామ్యం ఉంది. ఎవరైనా సూచనలు చేయొచ్చు.. లేఖ రాయొచ్చని తెలిపారు. అన్ని పార్టీల్లోను కోవర్టులుంటారు. మా పార్టీలో రేవంత్ రెడ్డి కోవర్టులుంటే ఉండొచ్చని కేటీఆర్ వెల్లడించారు.

Also Read:Rahul Gandhi: కాశ్మీర్‌లో యుద్ధ బాధిత కుటుంబాలకు రాహుల్‌గాంధీ పరామర్శ

కవిత లేఖతో పొలిటికల్ హీట్ పెరిగింది. కేసీఆర్ దేవుడే కానీ, చుట్టూ దెయ్యాలు ఉన్నాయని అమెరికా నుంచి తిరిగొచ్చిన తర్వాత కవిత మీడియాతో వెల్లడించారు. వాళ్ల వల్ల పార్టీకి నష్టం జరుగుతోందన్నారు. స్వయంగా నేను రాసిన లేఖనే బహిర్గతం అయ్యిందంటే పార్టీలో సామాన్యుల పరిస్థితి ఏంటి అన్నదానిపై చర్చ జరగాల్సిన అవసరం ఉందని తెలిపారు. పార్టీలో కోవర్టులు ఉన్నారంటూ కవిత హాట్ కామెంట్స్ చేశారు. కవిత కామెంట్స్ కు వార్నింగ్ ఇచ్చాడు కేటీఆర్. తెలంగాణకు పట్టిన దెయ్యం రేవంత్ రెడ్డి. ఆ దేయ్యాన్ని ఎట్ల వదిలించాలనేదే మా తాపత్రయం అని తెలిపారు.
YouTube video player