NTV Telugu Site icon

KTR : రూ.40 వేల కోట్ల రుణాలు ఉన్నాయని చెప్పి మాఫీ చేసిందెంత.?

Ktr

Ktr

రుణమాఫీ అంతా బోగస్ అని తేలిపోయిందని, స్వతంత్ర భారతదేశంలో నే ఇది అతి పెద్ద మోసమన్నారు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఒకే సంతకంతో రెండు లక్షల రుణమాఫీ చేస్తాం అన్నారని, రైతులను రేవంత్ రెడ్డి అడ్డంగా మోసం చేశారన్నారు. ఎన్నికల ముందు ప్రతి రైతు కు రుణమాఫీ చేస్తాము అన్నారని, రేషన్ కార్డు కావాలని చెప్పలేదన్నారు కేటీఆర్‌. వెంటనే వెళ్లి రెండు లక్షలు తెచ్చుకోండి అన్నారని, నలభై వేల కోట్లు అన్నారు కానీ చాలా కటింగ్ లు పెట్టారన్నారు. సీఎం అంటే కటింగ్ మాస్టర్ అని నిరూపించారని, ఎన్నికల ముందు చెప్పని కొర్రీలు ఇప్పుడు పెడుతున్నారన్నారు. పంద్రాగస్టు వరకు రుణమాఫీ అన్నారు కదా అని మేము కూడా వెయిట్‌ చేశామని, కానీ ఇప్పుడు అంతా మోసం అని అర్థం అయ్యిందని ఆయన మండిపడ్డారు. రుణమాఫీ నలభై శాతం మాత్రమే అయిందని, నిన్నటి వరకు 17 934 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ చేశారని ఆయన వ్యాఖ్యానించారు. brs ప్రభుత్వం మొదటి దఫా లో 35 లక్షల మందికి 17 వేల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశామని, మేము ఉన్నప్పుడు రుణమాఫీ చేశాము, రైతు బంధు ఇచ్చామన్నారు కేటీఆర్‌.

Devara Part – 1 : భైరా గాడి దెబ్బకు జనాలు అబ్బా.. సైఫ్ అదరకొట్టాడు బాసూ!

అంతేకాకుండా..’కానీ ఇప్పుడు ఇవ్వాల్సిన రైతు భరోసా ఇంకా ఇవ్వలేదు. రైతుల ను నమ్మించి తడి గుడ్డ తో గొంతు కోశారు. చారనా కోడి కి బారానా మసాలా అనే విధంగా ప్రభుత్వ తీరు ఉంది. కొండల్ రెడ్డి పర్యటన విజయవంతం అయింది.. రేవంత్ రెడ్డి పర్యటన ఫెయిల్ అయింది అని.. ఆయన ఫ్రస్టేషన్ లో ఉన్నారు.బక్రానంగల్ ప్రాజెక్టు తెలంగాణ లో ఉంది అని సీఎం అంటున్నారు. కొడంగల్ నియోజకవర్గంలో అయినా.. ఏ ఊరిలో అయినా పూర్తిగా రుణమాఫీ అయింది అని నిరూపిస్తే నేను రాజీనామా చేస్తాను. సీఎం కు దమ్ముంటే నా సవాల్ ను స్వీకరించండి. ఏ ఊరిలో అయినా 100 శాతం రుణమాఫీ అయింది అని నిరూపిస్తే నేను రాజకీయ సన్యాసం తీసుకుంటాను. మళ్లీ మీడియా ముందుకు కూడా రాను. పంద్రాగస్టు లోపల రుణమాఫీ చేస్తే హరీష్ రావు రాజీనామా చేస్తాను అన్నారు. పూర్తిగా రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు ను విమర్శిస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి మానసిక పరిస్థితి పై నాకు అనుమానం ఉంది. పాలన చెత్తగా ఉంది అని ప్రజలు చెబుతున్నారు.

Demonte Colony 2: వణికి పోవడానికి రెడీ అవ్వండి.. “డిమాంటీ కాలనీ 2” వచ్చేస్తోంది!

రేవంత్ రెడ్డి 19 వ సారి ఢిల్లీ కి వెళ్ళాడు. కేసీఆర్ పదేళ్ల లో కూడా 19 సార్లు ఢిల్లీ కి పోలేదు. ఈయన 8 నెలల్లో 19 సార్లు ఢిల్లీ వెళ్ళాడు. రేపటి నుంచి కార్యాచరణ ప్రకటిస్తాం.. ఊరు ఊరు తిరుగుతాం. నిన్న నేను మాట్లాడిన మాటలకు మహిళల కు క్షమాపణ చెప్పాను. సెప్టెంబర్ లో మేము వేరే రాష్ట్రాలకు పోతాము. అక్కడ ఉన్న పార్టీల పరిస్థితులు అధ్యయనం చేస్తాము. ఆ తర్వాత కొత్త కమిటీ లు వేస్తాము. టీడీపీ, ysrcp నుంచి కూడా కావాలంటే నేర్చుకుంటాం. టీడీపీ 40 ఏళ్లుగా, వైసీపీ 15 ఏళ్లుగా ఉన్నాయి. ఆంద్రప్రదేశ్ కు వెళ్ళము. మాకు రాజీనామాలు కొత్తకాదు.. రేవంత్ రెడ్డి కి మాట తప్పడం కొత్త కాదు. తెలంగాణ లో ఎన్నికలు రాబోతున్నాయి.. మేము సిద్ధంగా ఉన్నాము’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.