NTV Telugu Site icon

KTR: చరిత్ర చదవకుండా.. భవిష్యత్‌ను నిర్మించలేం..!

Ktr

Ktr

KTR: చరిత్ర చదవకుండా భవిష్యత్‌ను నిర్మించలేమని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల కోసం మరొక్కసారి దీక్ష చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ భవన్‌లో దీక్షా దివస్‌లో కేటీఆర్ పాల్గొన్నారు. ఆత్మగౌరవం.. అస్తిత్వం.. ప్రమాదంలో పడుతున్నప్పుడు తెలంగాణ సమాజాన్ని జాగృతం చేయకపోతే తప్పు చేసినవాళ్లమవుతామన్నారు. కేసీఆర్ ఆనవాళ్లు కాదు.. తెలంగాణ ఆనవాళ్లు చెరిపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేస్తున్నాడన్నారు. కష్టమొస్తే రాష్ట్ర ప్రజలకు తెలంగాణ భవన్ గుర్తొస్తోంది.. తెలంగాణ భవన్.. జనతా గ్యారేజ్‌గా మారిందన్నారు.

Read Also: CM Revanth Reddy: అత్యంత నిరుపేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇళ్లలో తొలి ప్రాధాన్యం

సమైక్యాంధ్ర సంచులు మోసిన తెలంగాణ ద్రోహి ముఖ్యమంత్రిగా ఉన్నాడని తీవ్రంగా విమర్శించారు. ఇక్కడున్న సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వంపై దాడి మొదలు పెట్టాడని ఆరోపించారు. ఉద్యమంపై గన్ను సీఎం రేవంత్ రెడ్డి ఎక్కుపెట్టాడన్నారు. కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేస్తా అని రెచ్చిపోతున్నాడన్నారు. సోనియమ్మ లేకపోతే.. తెలంగాణ అడుక్కుతినేదని అహంకారంతో వాగుతున్నాడన్నారు. తెలంగాణ అస్తిత్వంపై గుజరాత్ గులాములు ఓ పక్క.. ఢిల్లీ కీలుబొమ్మలు మరో పక్క దాడి చేస్తున్నారన్నారు. ప్రస్తుత పార్లమెంట్‌లో మన గళం వినిపించే నాథుడే లేడన్నారు. తెలంగాణ గొంతు బీఆర్ఎస్ మాత్రమే ఇంకెవరూ కాదన్నారు. లగచర్ల భూముల సేకరణ విరమణ బీఆర్ఎస్ విజయం, తెలంగాణ ప్రజల విజయమని కేటీఆర్ స్పష్టం చేశారు.

 

Show comments