NTV Telugu Site icon

KTR : తొందర్లోనే స్టేషన్ ఘనపూర్‌లో ఉప ఎన్నిక రాబోతుంది

Ktr

Ktr

తొందర్లోనే స్టేషన్ ఘనపూర్ లో ఉప ఎన్నిక రాబోతుందని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌ అన్నారు. స్టేషన్ ఘనపూర్ లో బీఆర్‌ఎస్‌ తరుపున రాజయ్య భారీ మెజారిటీతో గెలవబోతున్నారని, కేసీఆర్ కూడా పార్లమెంట్ ఎన్నికల సమయంలో చెప్పారన్నారు. హై కోర్ట్ లో కేసు తీర్పు రిజర్వ్ లో ఉందని, ఈ తీర్పు మనకు అనుకూలంగా వస్తుంది అని ఆశిస్తున్నామన్నారు కేటీఆర్‌. పార్టీ మారిన ఎమ్మెల్యే లపై వేటు పడడం ఖాయమని, మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప మెజారిటీ తో ఓడిపోయామన్నారు కేటీఆర్‌. ఈసారి మనమే అధికారంలోకి రాబోతున్నామని, రాష్ట్రం అంతా మోసపోయినా ఘనపూర్ ప్రజలు మాత్రం మోసపోలేదన్నారు కేటీఆర్‌.

CM Chandrababu: టీడీపీ ఎప్పటికి గుడివాడకు రుణపడి ఉంటుంది..

అంతేకాకుండా..’కానీ ఎన్నికల తర్వాత మాతో పాటు ఘనపూర్ ప్రజలు కూడా మోసపోయారు. కేవలం 1.5 శాతం అంటే నాలుగు లక్షల ఓట్ల తేడా తో మనం ఓడిపోయాము. పంద్రాగస్టు లోగా రెండు లక్షల రుణమాఫీ చేస్తాము అని దేవుళ్ళ మీద ఒట్టు వేసి చెప్పారు. కానీ ఈరోజు పంద్రాగస్టు వచ్చింది.. అయినా రుణ మాఫీ కాలేదు. రుణమాఫీ చేస్తున్నాం అని తెలంగాణ కు రావాలని రాహుల్ గాంధీ ని పిలిచారు. రుణమాఫీ చేస్తున్నాం అని బోగస్ మాటలు చెబుతున్నారని తెలిసి రాహుల్ గాంధీ రావట్లేదు అని తెలిసింది. ఈ రోజు సీఎం స్పీచ్ లో రాష్ట్రం అప్పుల పాలైంది అని చెప్పారు. ఒక ముఖ్యమంత్రి గా రాష్ట్రం గురించి ఇలా తక్కువ చేసి మాట్లాడడం చాలా తప్పు. పార్టీ విలీనం అయిపోతుంది అని చిల్లర ప్రచారం చేస్తున్నారు. మేము బెయిల్ కోసం ఢిల్లీ లో తిరుగుతుంటే బీజేపీ వాళ్ళను కలుస్తున్నాం అని విష ప్రచారం చేస్తున్నారు. సొంత చెల్లె జైల్ లో ఉంటే బెయిల్ కోసం తిరిగినా తప్పేనా… త్వరలోనే కేసీఆర్ నియోజకవర్గాలుగా అందరిని కలుస్తారు. ఉప ఎన్నిక వచ్చే స్టేషన్ ఘనపూర్ కార్యకర్తలను మొదటిగా కలుస్తారు. బీసీ రిజర్వేషన్ల విషయం లో కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుంది. బీసీ లకు రిజర్వేషన్లు పెంచకుండానే స్థానిక సంస్థల ఎన్నికలు కాంగ్రెస్ నిర్వహిస్తుంది.’ అని కేటీఆర్‌ వ్యాఖ్యానించారు.

Train Accident: మరో రైలు ప్రమాదం.. ఊడిపోయిన రెండు కోచ్‌లు