NTV Telugu Site icon

KTR : ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది?

Ktr

Ktr

మేడిగడ్డ బారేజ్ పిల్లర్లు కుంగిపోవడానికి కాంగ్రెస్ కుట్ర ఉందనే అనుమానాలు ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీరామారావు అన్నారు. ఇవాళ ఆయన బీఆర్‌ఎస్‌ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. లక్షల క్యూసెక్కుల వరద వచ్చిన చెక్కుచెదరని బ్యారేజ్ ఎన్నికల ముందు అలా ఎందుకు అవుతుందని, ఎన్నికలకు ముందే బ్యారేజ్ పరిస్థితి ఎందుకు అలా అవుతుంది? అని ఆయన ప్రశ్నించారు. మున్ముందు బారేజ్ కు ఏమీ జరిగినా ఈ ప్రభుత్వ కుట్ర ఫలితమే అని భావించాల్సి ఉంటుందని, ఒకరిద్దరు మంత్రులకు ఎవరితో సంబంధాలున్నాయో తెలుసు. వారు బారేజ్ ను ఏమైనా చేయగలరన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు పై కాంగ్రెస్ ప్రభుత్వం తప్పించుకునే యత్నం చేస్తోందని, NDSA రిపోర్టు ను అడ్డం పెట్టుకుని నీళ్లను ఎత్తిపోయడం లేదన్నారు కేటీఆర్‌. ఎల్లంపల్లి నుంచి నీరు ఇప్పటికైనా ఎత్తిపోయడం సంతోషమే అని, అయితే 2 టీ ఎం సీ ల నీరు ఎత్తి పోస్తే సరిపోదన్నారు. కన్నెపల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు ఎత్తిపోయడానికి ప్రభుత్వానికి అహం అడ్డు వస్తోందని, కాళేశ్వరం ప్రాజెక్టును విఫల ప్రాజెక్టుగా చూపించాలనుకుని విఫలమయ్యారన్నారు.

Cars in August: మహీంద్రా థార్ 5-డోర్‌తో సహా ఆగస్టులో రాబోతున్న కార్లు ఇవే..

అంతేకాకుండా..’నిన్న మేము మేడి గడ్డ వెళ్ళినపుడు పది లక్షల క్యూసెక్కుల నీళ్లు ప్రవహిస్తున్నాయి. 28 లక్షల క్యూసెక్కుల ప్రవాహాన్ని కూడా మేడి గడ్డ బారేజ్ తట్టుకుని నిలబడింది. NDSA రిపోర్టు కాదు అది nda రిపోర్టు. కాంగ్రెస్ బీజేపీ లు ఏ విషయం లో విభేదించినా కాళేశ్వరం మీద ఓకే వైఖరి తో ఉన్నారు. ఉత్తమ్ ndsa రిపోర్ట్ ఆధారంగా నడుచుకుంటారంటున్నారు ..బీజేపీ చెప్పినట్టు నడుచుకుంటారు. పోలవరం కాఫర్ డాం కొట్టుకుపోయినపుడు ndsa రిపోర్టు ఎక్కడ పోయింది ?. 90 టీఎంసీ ల నీళ్లు గోదావరి లో వృధా గా పోతున్నాయి. 90 టీఎంసీ ల నీళ్లు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు తో సమానం. భేషజాలకు పోకండి ..కన్నె పల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయండి. ఎల్లంపల్లిలో 16 టీఎంసీ ల నీళ్ళే ఉన్నాయి .పద్నాలుగు టీఎంసీ ల నీళ్లు హైదరాబాద్ కు నిలువ ఉంచాలి…రెండు టీఎంసీ ల నీళ్లు లిఫ్ట్ చేశాకే ఆపే అవకాశం ఉంది. ఎల్లంపల్లి నీళ్లు మిడ్ మానేరు ,మిగతా రిజర్వాయర్లు నింపడానికి సరిపోవు. కన్నె పల్లి పంప్ హౌజ్ నుంచి నీళ్లు లిఫ్ట్ చేయడం తప్ప వేరే మార్గం లేదు. ఇపుడు ఏ ఎన్నికలు లేవు ..రాజకీయం చేయకండి. కాళేశ్వరం అనేది కరువు కు ఇన్సూరెన్స్. ఇప్పటికే రాష్ట్రం లో వర్ష పాతం 40 శాతం లోటు ఉంది. లిఫ్ట్ లకు విద్యుత్ ఖర్చు అయితే అవుతుంది ..రైతులకు నీళ్లు ఇవ్వడం కంటే ఆ ఖర్చు ముఖ్యమా ? అని ఆయన అన్నారు.

 
Woman Killed By Brothers: మూడో పెళ్లి చేసుకోవాలనుకున్న మహిళ.. హత్య చేసిన సోదరులు..