తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో శనివారం అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం సాగింది. ఈ క్రమంలో.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు మాజీ మంత్రి కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. నిజంగానే సిగ్గు పడుతున్నా.. పంట భీమా, రైతు భీమాకి తేడా లేకుండా మాట్లాడుతున్నాడు సీఎం అని ఎద్దేవా చేశారు. అందుకు సిగ్గు పడుతున్నానని అన్నారు. 2014 వరకు ఇసుక మీద వచ్చిన ఆదాయం రూ. 39 కోట్లు.. 2014 తర్వాత ఆదాయం పెరిగిందని తెలిపారు. ఇసుక మాఫియా మాది కాదు.. కాంగ్రెస్ దని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ హయాంలోనే ఇసుక మాఫియా ఉండేదని.. అందుకే అప్పట్లో రూ.4 కోట్ల ఆదాయం కూడా రాలేదని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ హయాంలో ఇసుక ఆదాయం ఎటుపోయిందో చెప్పాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. నేరేళ్లలో తనకు మద్దతు ఇచ్చి భారీ మెజారిటీతో గెలిపించారని తెలిపారు. నోటికి ఎంత వస్తే అంత మాట్లాడొద్దని కేటీఆర్ సూచించారు. ఏ విచారణకు అయినా సిద్ధం.. సీఎం స్థాయి వ్యక్తి అలా మాట్లాడటం సరికాదని కేటీఆర్ పేర్కొన్నారు.
Harish Rao: ఇంకా రేవంత్ సీఎం అయినట్టు భావించడం లేదు
అంతకుముందు.. డ్రగ్స్ నిర్మూలన విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కేటీఆర్ మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. హైదరాబాద్‌ను మాదక ద్రవ్యాల రహితంగా తీర్చిదిద్దుతామని రేవంత్ రెడ్డి అన్నారు. ఈ విషయంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ధ్వజమెత్తారు. సీఎం వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఎటాక్ చేశారు. తెలంగాణ స్టేట్ యాంటీ నార్కొటిక్స్ బ్యూరోను ఏర్పాటు చేసిందే తమ ప్రభుత్వమని గుర్తు చేశారు. సీనియర్ ఐపీఎస్ అధికారి అదనపు పోలీస్ డైరెక్టర్ జనరల్ సీవీ ఆనంద్ వంటి సమర్థుడైన అధికారిని దీనికి చీఫ్‌గా నియమించామని పేర్కొన్నారు. తొమ్మిది నెలల కిందటే అన్ని జిల్లాల పోలీస్ సూపరింటెండెట్లతో ఓ పకడ్బందీగా యాంటీ డ్రగ్స్ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేశామని కేటీఆర్ వివరించారు. రేవంత్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తరువాత సీవీ ఆనంద్‌ను ఆ స్థానం నుంచి బదిలీ చేసిందని, దీని వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు.