కేటిఎం బైకులకు ఎలాంటి క్రేజ్ ఉంటుందో వేరే చెప్పక్కర్లేదు. కుర్రాళ్లు కేటిఎం బైకులు కొనేందుకు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తుంటారు. స్టైలిష్ డిజైన్, అద్భుతమైన పెర్ఫార్మెన్స్, అడ్వెంచర్ రైడింగ్‌కు అనువైన ఫీచర్లతో కేటిఎం బైక్‌లు రైడర్లను ఇంప్రెస్ చేస్తాయి. అయితే బైక్ లవర్స్ కు కేటిఎం బ్యాడ్ న్యూస్ అందించింది. ఇకపై ఆ రెండు బైకులు కనిపించవని తెలిపింది. KTM భారత్ లో తన రెండు బైకులను నిలిపివేసింది. కంపెనీ ఈ రెండు మోటార్ సైకిళ్లను తన ఇండియా వెబ్‌సైట్ నుంచి తొలగించింది. కంపెనీ ఇప్పుడు KTM డ్యూక్ 125, KTM RC 125 లను నిలిపివేసింది. కంపెనీ తీసుకున్న ఈ నిర్ణయానికి గల కారణం సేల్స్ లేకపోవడమే.
Also Read:Kodali Nani: కొడాలి నానికి 10 గంటలపాటు హార్ట్ సర్జరీ.. ఇప్పుడు ఎలా ఉందంటే?
KTM డ్యూక్ 125, RC 125 లను రైడర్లకు బెస్ట్ ఆప్షన్ గా మారాయి. కానీ వాటి అధిక ధర కారణంగా అవి గట్టి పోటీని ఎదుర్కొన్నాయి. KTM డ్యూక్ 125 ధర రూ. 1,81,030 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ), ఇది యమహా MT-15 కంటే దాదాపు రూ. 12,000 ఎక్కువ. KTM RC 125 ధర రూ. 1,91,795 (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ). అయితే ఈ రెండు బైకుల పర్ఫామెన్స్ ఆశించినంతగా లేకపోవడంతో రైడర్లు వీటి కొనుగోలుకు వెనకడుగు వేస్తున్నారు. ఇంజిన్ పనితీరు ఆశించినంతగా లేకపోవడంతో రెండు మోటార్ సైకిళ్ల అమ్మకాలు క్షీణించాయి. దీంతో భారత్ మార్కెట్ నుంచి తొలగించింది.
Also Read:TGBIE: విద్యార్థులకు గుడ్‌న్యూస్.. ఇంటర్మీడియట్ కళాశాలలకు వేసవి సెలవులు ప్రకటన..
జనవరి 2025లో KTM డ్యూక్ 125 కేవలం 17 యూనిట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. ఈ రెండు మోటార్ సైకిళ్లను కంపెనీ భారత మార్కెట్ నుంచి తొలగిస్తున్నప్పటికీ, కొత్త KTM డ్యూక్ 160, KTM RC 160 లను విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ రెండూ ఇటీవల భారత్ రోడ్లపై టెస్ట్ చేస్తున్నప్పుడు కనిపించాయి. కొత్త KTM డ్యూక్ 160, RC 160 లను 2025 మధ్య నాటికి భారత మార్కెట్లో విడుదల చేయవచ్చు. దీని ఎక్స్-షోరూమ్ ధర రూ. 1.80 లక్షల నుంచి రూ. 1.90 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా వేస్తున్నారు.