NTV Telugu Site icon

KRMB: ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ.. వెంటనే నీరు తీసుకోవడం ఆపండి..

Krmb

Krmb

ఏపీ ప్రభుత్వానికి కేఆర్‌ఎంబీ లేఖ రాసింది. వెంటనే సాగర్ ఉద్రిక్తతకు తెరదించాలని లేఖలో విజ్ఞప్తి చేసింది. సాగర్ డ్యామ్ నుంచి నీటి విడుదల విషయంలో చర్చనీయాంశంగా మారిన సంగతి తెలిసిందే.. అయితే వెంటనే నీరు తీసుకోవడం ఆపాలని ఏపీ ప్రభుత్వాన్ని కేఆర్ఎంబీ ఆదేశించింది. ఏపీ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం తమకు పిర్యాదు చేసిందని కేఆర్ఎంబీ లేఖలో పేర్కొంది. ఏపీ సాగు నీరు కావాలని తమను కోరలేదని లేఖలో కేఆర్‌ఎంబీ స్పష్టం చేసింది. అక్టోబర్‌ నెల కోసం అడిగిన 5 టీఎంసీల నీటిలో ఇప్పటికే 5.01 టీఎంసీల నీటిని విడుదల చేసినట్లు లేఖలో పేర్కొ్న్నారు. నవంబర్ 30 తర్వాత నీటి విడుదలపై ఏపీ ప్రభుత్వం నుంచి ఎలాంటి వినతి అందలేదని స్పష్టం చేసింది. అయితే ఈ లేఖపై ఏపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది చూడాలి.

Read Also: Abhishekam: 60 కేజీల అచ్చమైన కారంతో స్వామీజీకి అభిషేకం..

కాగా.. ఏపీ పోలీసులపై నాగార్జునసాగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. తెలంగాణ ఎస్పీఎఫ్ పోలీసుల ఫిర్యాదు మేరకు విజయపురి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. పోలీసులతో పాటు రాష్ట్రంలోని నీటిపారుదల అధికారులపై తెలంగాణ ఎస్పీఎఫ్‌ను ప్రయోగించారు. అర్థరాత్రి సీసీ కెమెరాలను ధ్వంసం చేశారని, ఏపీ పోలీసులు అనుమతి లేకుండా డ్యాం వద్దకు వచ్చి కుడి కాల్వకు నీటిని విడుదల చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

Read Also: AAI Jobs 2023: గుడ్‌న్యూస్.. ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియాలో 900 ఉద్యోగాలు.. పూర్తి వివరాలు..

మరోవైపు నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద పోలీసు పహారా కొనసాగుతోంది. ముళ్లకంచెల నడుమ సాగర్ డ్యామ్ పై పోలీసులు బందోబస్తు నిర్వహిస్తున్నారు. అటే ఏపీ వైపు పోలీసులు భారీగా మోహరించారు. సుమారు 1200 మంది పోలీసులు అక్కడ ఉన్నారు. తెలంగాణ పోలీసులు అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. కేఆర్ఎంబీ అధికారులు సాగర్ వద్దకు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.