Site icon NTV Telugu

Kriti Sanon : కెరీర్ ప్రారంభంలో ఎంతో ఇబ్బంది పడ్డాను..

Whatsapp Image 2023 09 04 At 2.27.51 Pm

Whatsapp Image 2023 09 04 At 2.27.51 Pm

కృతి సనన్.. ఈ భామ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. సూపర్ స్టార్ మహేష్ నటించిన “వన్ నేనొక్కడినే’ సినిమాతో ఈ భామ టాలీవుడ్ కి పరిచయం అయింది. కానీ ఆ సినిమా అంతగా ఆకట్టుకోలేదు. దీనితో ఈ భామకు బాలీవుడ్ కు వెళ్ళిపోయింది. ఈ భామ బాలీవుడ్ లో వరుస చిత్రాలలో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తాజాగా ఈ భామకు ‘మీమీ’ సినిమాలో ఆమె అద్భుతమైన నటనకు గానూ ఉత్తమ నటిగా జాతీయ అవార్డు కూడా లభించింది.అయితే తన కెరీర్‌ ప్రారంభ రోజుల్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులను కృతి సనన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. ర్యాంప్ వాక్‌ సమయంలో ఓ కొరియోగ్రాఫర్‌ తనతో ఎంతో దురుసుగా ప్రవర్తించారంటూ అప్పటి చేదు అనుభవాన్ని గుర్తుచేసుకుంది ఈ భామ.తాను ఎంచుకున్న సినీ ఫీల్డ్ లో అవకాశాలు రాకపోతే ఉన్నత చదువులను కొనసాగించాలని ఇండస్ట్రీకి రాకముందే ఆమె నిర్ణయించుకున్నట్లు తెలిపింది.. అందుకే ఒకవైపు మోడలింగ్‌ చేస్తూనే మరోవైపు పోటీ పరీక్షలకు కూడా శిక్షణ తీసుకునేదానిని అని కృతి తెలిపింది.. నా మొదటి ర్యాంప్‌ వాక్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవం నాకిప్పటికీ కూడా గుర్తుంది.

మోడలింగ్‌లోకి అడుగుపెట్టిన మొదట్లో అక్కడి వాతావరణం, వ్యక్తుల గురించి నాకు అంతగా తెలియదు. దీంతో నేను కొద్దిగా కన్ఫ్యూజ్ అయ్యాను. ఒకరోజు హైహీల్స్‌ వేసుకుని నేను గడ్డిలో నడవాల్సి వచ్చింది. ఆ చెప్పులు గడ్డిలో కూరుకుపోయి ఇబ్బంది పడ్డాను. దీంతో అక్కడే ఉన్న కొరియోగ్రాఫర్‌ నాతో దురుసుగా ప్రవర్తించింది. అందరి ముందు నన్ను దారుణంగా తిట్టింది. ఆ సమయంలో నాకు ఎంతో బాధ కలిగింది.. కానీ దేనికీ వెనుకడుగు వేయలేదు ” అంటూ అప్పటి రోజులను గుర్తుచేసుకున్నారు కృతి.. అలా ప్రవర్తించిన కొరియోగ్రాఫర్‌తో మరోసారి నేను పనిచేయలేదని కృతి తెలిపారు.ఇక మోడలింగ్‌ చేస్తోన్న సమయంలోనే సూపర్ స్టార్ మహేశ్‌ బాబు తో కలిసి నటించే అవకాశం వచ్చినట్లు కృతి సనన్‌ తెలిపారు. అలాగే ‘హీరోపంటి’ చిత్ర యూనిట్ కూడా అదే సమయంలో తనని సంప్రదించినట్లు తెలిపారు.. ఈ రెండు సినిమాల షూటింగ్‌ గ్యాప్‌లో తాను పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయినట్లు కృతి తెలిపారు. భవిష్యత్తుకు సంబంధించి ఎప్పుడూ రెండు ప్లాన్స్ ఉండాలని కృతి వివరించారు. ప్లాన్‌ ఏ వర్క్ ఔట్ అవ్వకపోతే ప్లాన్‌ బీ అమలు చేయాలని ఆమె తెలియజేశారు

Exit mobile version