Kriti Sanon: తొలి భారతీయ మహిళా నటిగా ‘కృతి సనన్’ చరిత్ర!
- బెర్లిన్‌లో ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025
- తొలి భారతీయ మహిళా నటిగా కృతి సనన్ చరిత్ర
- మహిళల ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోవద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కృతి సనన్ చరిత్ర సృష్టించారు. బెర్లిన్‌లో జరిగిన ప్రపంచ ఆరోగ్య సదస్సు 2025లో ప్రసంగించిన తొలి భారతీయ మహిళా నటిగా నిలిచారు. ‘మహిళల ఆరోగ్యం- ప్రపంచ సంపద’ అనే అంశంపై కృతి మాట్లాడారు. ప్రభుత్వాలు, ప్రపంచ సంస్థలు మహిళల ఆరోగ్యాన్ని తేలిగ్గా తీసుకోకూడదని.. దీనిని మానవాళి పురోగతి శ్రేయస్సు, భవిష్యత్తుకు మూలస్తంభంగా పరిగణించాలన్నారు. ప్రపంచ జనాభాలో దాదాపుగా సగం మంది మహిళలే ఉన్నారని, వారి వైద్యానికి సరిపడా నిధులు లేవని కృతి అన్నారు. హీరోయిన్ కృతి తన ప్రభావంతమైన ప్రసంగంతో ప్రపంచ దేశాలను ఆకట్టుకున్నారు.
Also Read: Daily Horoscope: నేటి దిన ఫలాలు.. ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే!
Also Read
- CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
- US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
- Harmanpreet Kaur: రాష్ట్రపతి చేతుల మీదుగా 'పద్మశ్రీ' అందుకున్న టీమిండియా కెప్టెన్.!
- RCB vs GT: వర్షం వల్ల క్వాలిఫయర్-1 రద్దయితే ఫైనల్ చేరేది ఎవరు.! రూల్స్ ఏమంటున్నాయంటే.?
‘మహిళల ఆరోగ్యం, లింగ సమానత్వం కోసం పెట్టుబడి పెట్టడం నైతిక ఆవశ్యకత మాత్రమే కాదు భవిష్యత్తులో ఒక వ్యూహాత్మక పెట్టుబడి. ఆరోగ్యకరమైన మహిళలు బలమైన కుటుంబాలు, సంఘాలు, ఆర్థిక వ్యవస్థలను రూపొందిస్తారు. ఆరోగ్యం, శ్రేయస్సుకు సంబంధించిన కార్యకలాపాలలో మహిళలు చురుకుగా పాల్గొనాలి. బాల్య వివాహం, ప్రసూతి సంరక్షణ లాంటి అంశాల్లో మార్పులను సృష్టించాలంటే ప్రపంచ దేశాలు జోక్యం చేసుకోవాలి’ అని కృతి సనన్ కోరారు. ‘ఆమె లేకుండా ఏమీ లేదు’ అనే సూత్రాన్ని కృతి బలోపేతం చేశారు. కృతి తాజాగా నటించిన ‘తేరే ‘తేరే ఇష్క్ మే’ సినిమా నవంబరు 28న రిలీజ్ కానుంది. ఇటీవల ఐక్యరాజ్యసమితి పాపులేషన్ ఫండ్ (యూఎన్‌ఎఫ్‌పీఏ) ఇండియాకు లింగ సమానత్వ గౌరవ రాయబారిగా కృతి ఎంపికైన విషయం తెలిసిందే.
తాజావార్తలు
-
RCB vs GT Qualifier 1: బెంగళూరు vs గుజరాత్ మెగా సమరం.. పిచ్, లైవ్ స్ట్రీమింగ్, హెడ్ టు హెడ్ రికార్డ్స్ ఇవే!
-
Suriya 50: ‘కరుప్పు’ హిట్ జోష్‌లో సూర్య.. 50వ సినిమాకు భారీ ప్లాన్!
-
Ananya Panday: అనన్య పాండేపై నెటిజన్ల ఫైర్!
-
CNG Price Hike: సామాన్యుడిపై ఇంధన భారం.. మరోసారి సీఎన్జీ ధరల పెంపు..
-
US-Iran War: పశ్చిమాసియాలో మరోసారి యుద్ధ మేఘాలు.. ఇరాన్‌పై అమెరికా ‘ఆత్మరక్షణ’ దాడులు!
ట్రెండింగ్
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!
-
Vivo Y600 Turbo లాంచ్.. 9000mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో అద్భుత ఫీచర్స్ ఇవే.!
-
Lemon Pickle: చేదు రాకుండా, బూజు పట్టకుండా.. సంవత్సరం పొడవునా పాడవకుండా ‘నిమ్మకాయ పచ్చడి’ చేసేయండి ఇలా..!
-
iPhone Users Alert: వెలుగులోకి కొత్త ఫిషింగ్ మోసం.. అలర్ట్ జారీ చేసిన కేంద్రం.!
-
Early Age S*ex Results: చిన్న వయసులోనే శృంగారం.. ఈ సమస్యలు తప్పవా.?