Site icon NTV Telugu

Krithi Shetty: చాలా కాలం తర్వాత ప్యూర్ లవ్ స్టోరీ చేస్తున్నా..

Krithishety

Krithishety

టాలీవుడ్ సెన్సేషన్ కృతి శెట్టి, కోలీవుడ్ యంగ్ స్టార్ ప్రదీప్ రంగనాథన్ జంటగా నటించిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ (LIK) ఏప్రిల్ 10న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో కృతి శెట్టి తన ఆనందాన్ని పంచుకుంది. ‘మనం ఇప్పటి వరకు చాలా పీరియాడిక్ సినిమాలు చూశాం, అంటే గత కాలపు కథలను ఎక్కువగా చూశాం. కానీ భవిష్యత్తు (Future) ఎలా ఉండబోతోంది? అనే కాన్సెప్ట్‌తో సినిమాలు చాలా తక్కువగా వచ్చాయి. ఈ సినిమా ఒక యూనిక్ ఫ్యూచరిస్టిక్ లవ్ స్టోరీ’ అని కృతి పేర్కొంది.

Also Read : Trisha: కోటీశ్వరుడితో పెళ్లి.. నలుగురు పిల్లల బర్త్ డే.. సంచలనంగా మారిన త్రిష ఇన్‌స్టా పోస్ట్

ముఖ్యంగా తన కెరీర్ గురించి చెబుతూ.. ‘నేను ప్యూర్ లవ్ స్టోరీ చేసి చాలా కాలం అయ్యింది. విఘ్నేష్ శివన్ గారు ఈ కథను మలిచిన తీరు అద్భుతం. ప్రదీప్ రంగనాథన్ తో కెమిస్ట్రీ కూడా బాగా కుదిరింది’ అని ఆమె వెల్లడించింది. అనిరుధ్ అందించిన సంగీతం ఇప్పటికే చార్ట్ బస్టర్‌గా నిలవగా, కృతి శెట్టి ఇందులో ఒక సరికొత్త గ్లామరస్ సాఫ్ట్ క్యారెక్టర్‌లో కనిపించబోతోంది. ఈ సినిమాతో అటు తమిళం, ఇటు తెలుగులో తన మార్కెట్ ను మళ్లీ పుంజుకుంటుందని కృతి ధీమా వ్యక్తం చేస్తోంది. విభిన్నమైన టెక్నాలజీ ఎమోషన్స్ కలగలిసిన ఈ చిత్రం యువతను విశేషంగా ఆకట్టుకుంటుందని చిత్ర యూనిట్ భావిస్తోంది.

Exit mobile version