NTV Telugu Site icon

Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేటు వెనుక భారీ కుట్ర!

Suryakumar Yadav, Hardik Pandya

Suryakumar Yadav, Hardik Pandya

Krishnamachari Srikkanth React on Hardik Pandya’s T20 Captaincy Snub: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం హార్దిక్‌ను కాకుండా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. అయితే అగార్కర్ వివరణపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు.

హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేటుపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన కారణాలు అస్సలు నమ్మశక్యంగా లేవని, ఇతర కారణాలతోనే వేటు వేశారని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు. శ్రీకాంత్ తన యూట్యూబ్‌లో మాట్లాడుతూ… ‘హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని భారత డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫిర్యాదుతోనే బీసీసీఐ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. బహుశా ఐపీఎల్ 2024 నుంచే ఇది ఆరంభం అయుంటుంది. కెప్టెన్సీ వేటుకు గల కారణం ఫిట్‌నెస్ ఏ మాత్రం కాదు. దీన్ని నేను అంగీకరించను. ఐపీఎల్ 2024 మొత్తం ఆడాడు. బౌలింగ్ కూడా చేశాడు. అయితే అతడు బాగా రాణించలేదన్నది మాత్రం వాస్తవం’ అని అన్నారు.

Also Read: Nita Ambani-IOC: మరోసారి ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ!

‘టీ20 ప్రపంచకప్‌ 2024లో హార్దిక్ పాండ్యా వైస్‌ కెప్టెన్‌. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే పాండ్యాను తొలగించిన విధానం మాత్రం నచ్చలేదు. అతనికి సూటిగా విషయం చెప్పాల్సింది. ఫిట్‌నెస్ అని కారణాలు చెప్పాల్సింది కాదు. నేను సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా చేశాను. ఏ ఆటగాడికైనా సరైన వివరణ ఇవ్వాలి’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.