Hardik Pandya Captaincy: హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేటు వెనుక భారీ కుట్ర!
- టీ20 ఫార్మాట్‌కు రోహిత్ వీడ్కోలు
- కృష్ణమాచారి అసహనం
- సూటిగా విషయం చెప్పాల్సింది
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Krishnamachari Srikkanth React on Hardik Pandya’s T20 Captaincy Snub: టీ20 ప్రపంచకప్ 2024 అనంతరం టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 ఫార్మాట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. రోహిత్ వారసుడిగా హార్దిక్ పాండ్యా టీ20 సారథ్య బాధ్యతలు చేపడుతాడని అంతా అనుకున్నారు. కానీ కొత్త హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాత్రం హార్దిక్‌ను కాకుండా సూర్యకుమార్ యాదవ్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేశారు. హార్దిక్ ఫిట్‌నెస్ సమస్యల కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నామని చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ తెలిపారు. అయితే అగార్కర్ వివరణపై టీమిండియా మాజీ కెప్టెన్ కృష్ణమాచారి శ్రీకాంత్ అసహనం వ్యక్తం చేశారు.
హార్దిక్ పాండ్యా కెప్టెన్సీ వేటుపై చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ చెప్పిన కారణాలు అస్సలు నమ్మశక్యంగా లేవని, ఇతర కారణాలతోనే వేటు వేశారని కృష్ణమాచారి శ్రీకాంత్ పేర్కొన్నారు. శ్రీకాంత్ తన యూట్యూబ్‌లో మాట్లాడుతూ… ‘హార్దిక్ పాండ్యాను కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించాలని భారత డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన ఫిర్యాదుతోనే బీసీసీఐ సెలెక్టర్లు ఈ నిర్ణయం తీసుకొని ఉండొచ్చు. బహుశా ఐపీఎల్ 2024 నుంచే ఇది ఆరంభం అయుంటుంది. కెప్టెన్సీ వేటుకు గల కారణం ఫిట్‌నెస్ ఏ మాత్రం కాదు. దీన్ని నేను అంగీకరించను. ఐపీఎల్ 2024 మొత్తం ఆడాడు. బౌలింగ్ కూడా చేశాడు. అయితే అతడు బాగా రాణించలేదన్నది మాత్రం వాస్తవం’ అని అన్నారు.
Also Read
- Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
- US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
- Smit Machchhar: భారత పైలట్‌కు ఘన గౌరవం.. ఇజ్రాయెల్‌లో మారుమోగుతున్న మచ్చర్ పేరు!
- Election Commission: ఎన్నికల సంఘంలో విభేదాలపై సంచలనం.. ‘‘అన్ని నిర్ణయాలు ఏకగ్రీవమే’’..
Also Read: Nita Ambani-IOC: మరోసారి ఐఓసీ సభ్యురాలిగా నీతా అంబానీ!
‘టీ20 ప్రపంచకప్ 2024లో హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్. మెగా టోర్నీలో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు పాండ్యాను కెప్టెన్సీ నుంచి తొలగించడం ఆశ్చర్యానికి గురి చేసింది. సూర్యకుమార్ యాదవ్‌కు కెప్టెన్ అయ్యేందుకు అన్ని అర్హతలు ఉన్నాయి. అయితే పాండ్యాను తొలగించిన విధానం మాత్రం నచ్చలేదు. అతనికి సూటిగా విషయం చెప్పాల్సింది. ఫిట్‌నెస్ అని కారణాలు చెప్పాల్సింది కాదు. నేను సెలెక్షన్ కమిటీ ఛైర్మన్‌గా చేశాను. ఏ ఆటగాడికైనా సరైన వివరణ ఇవ్వాలి’ అని కృష్ణమాచారి శ్రీకాంత్ చెప్పుకొచ్చారు.
తాజావార్తలు
-
Sumalatha: జానీ మాస్టర్ అంటే ఎందుకు అంత భయం? వల్లభనేని అనిల్‌పై సుమలత ఫైర్!
-
Divya Mittal: దివ్యా మిట్టల్ కోసం కాంగ్రెస్, ఎస్పీ పోటీ? యూపీలో మాజీ IAS సంచలనం..
-
Tollywood Box Office: టాలీవుడ్‌ను ముంచేసిన సెప్టెంబర్.. నాని ‘ది ప్యారడైజ్’ గట్టెక్కుతుందా?
-
US Crime: ప్రెగ్నెంట్ కూతురి హత్య కేసులో సంచలనం.. కాబోయే అల్లుడితో తల్లికి లైంగిక సంబంధం!
-
Krishna: ఇండస్ట్రీని రెండుగా చీల్చాలని చూస్తే ఊరుకోం.. జానీ మాస్టర్ భార్యపై ప్రొడక్షన్ ప్రెసిడెంట్ ఫైర్!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?