Nagarjuna Sagar: తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా నీటి విడుదల అంశం మరోసారి రచ్చ రచ్చ అవుతోంది. నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకు పోలీసులు భారీగా చేరుకున్నారు. తెలంగాణ పోలీసుల ఆధీనంలో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్ కు నీటిని విడుదల చేయకపోవడంతో ఏపీకి నీటి కష్టాలు ఎదురవుతున్నాయని ఏపీ పోలీసులు ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో తెలంగాణ పోలీసులు కూడా పెద్దఎత్తున అక్కడికి రావడంతో ఒక్కసారిగా అక్కడ వాతావరణం ఉద్రిక్తంగా మారింది. ఏపీ పోలీసులు సీసీ కెమెరాలు, డ్యామ్ గేట్లను ధ్వంసం చేశారు.
Read Also:Hyderabad: పాతబస్తీలో పోలింగ్ కేంద్రాల వద్ద పోలీసుల భారీ బందోబస్తు..
ప్రస్తుతం నాగార్జున సాగర్ డ్యామ్‌పై ట్రాఫిక్ నిలిచిపోయింది. ఇరు రాష్ట్రాలకు చెందిన వందలాది మంది పోలీసులు అక్కడ మోహరించారు. నాగార్జున సాగర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు ఏపీ అధికారులు ప్రయత్నించారు. దీన్ని తెలంగాణ అధికారులు అడ్డుకున్నారు. నాగార్జున సాగర్‌లో నీటిని విడుదల చేస్తేనే ఏపీకి నీరు వచ్చే అవకాశం ఉండడంతో.. దాదాపు 700 మంది ఏపీ పోలీసులు ఎలాగైనా నీటిని విడుదల చేయాలని తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.
Read Also:Telangana Elections 2023: అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధం.. మరికాసేపట్లో ప్రారంభం కానున్న పోలింగ్!
నాగార్జున సాగర్లో ఏపీ పోలీసుల భారీ బందోబస్తుపై తెలంగాణ కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట రెడ్డి స్పందించారు. ఇదంతా తెలంగాణ బీఆర్ఎస్ ప్రభుత్వం కుట్ర అని అన్నారు. కాంగ్రెస్ గెలుస్తుంది అనే ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ డ్రామాకు తెరలేపిందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు. మొత్తంగా తెలంగాణ పోలీసుల కంట్రోల్‌లో ఉన్న నాగార్జున సాగర్ డ్యామ్‌కి ఏపీ పోలీసులు వెళ్లడం.. సరిగ్గా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల రోజునే ఇలా చెయ్యడం.. తీవ్ర కలకలం రేపుతోంది.
