SP P.JOSHUA: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠినచర్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కృష్ణాజిల్లాలో గన్నవరం వివాదం చినికి చినికి గాలివానగా మారుతోంది. జిల్లాలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు జిల్లా ఎస్పీ పి.జాషువా. గన్నవరం సంఘటనపై కృష్ణా జిల్లా ఎస్పీ జాషువా కీలక వ్యాఖ్యలు చేశారు. గన్నవరం నియోజకవర్గ పరిధిలో టిడిపి వైసిపి శ్రేణులు మధ్య నెలకొన్న ఘర్షణల నేపథ్యంలో టిడిపి శ్రేణులు చలో గన్నవరం కార్యక్రమానికి పోలీసువారి అనుమతులు లేవు. తెలుగు దేశం పార్టీ నాయకుడు పట్టాభి, విధులు నిర్వహిస్తున్న పోలీసులు మీద దాడికి పురి గొల్పడం బాధ్యతా రహితంగా వ్యాఖ్యలు చేయడం తో శాంతిభద్రతల సమస్య ఉత్పన్నమై, జరిగిన ఘర్షణ లో విధులు నిర్వహిస్తున్న గన్నవరం సిఐ కనకారావు తలకు బలమైన గాయమైంది. పట్టాభి తొందరపాటు చర్యలు, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలిగిందన్నారు.
Read Also: MLC Elections: ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎంకు బీఆర్ఎస్ మద్దతు.. సీఎం కేసీఆర్ నిర్ణయం
Also Read
తెలుగు దేశం పార్టీ ఆఫీసు పై జరిగిన దాడికి సంబంధించిన వీడియో ఫుటేజీలు పరిశీలిస్తున్నాం.సుమోటోగా రైటింగ్ కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేపట్టడం జరిగింది. చట్టాన్ని అతిక్రమించిన వారు ఎవరైనా చట్టరీత్యా చర్యలు తప్పవన్నారు. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిసర ప్రాంతాల్లో సెక్షన్ 144 CRPC, 30 పోలీస్ ఆక్ట్ అమలు.ముందస్తు అనుమతి లేకుండా సభలు, సమావేశాలు, నిరసన కార్యక్రమాలు మొదలగునవి నిర్వహించరాదు. గన్నవరం పరిసర ప్రాంతాలలో ఎవరు ప్రవేశించకుండా చెక్ పోస్ట్ లు, పికెట్స్ ఏర్పాటు చేశామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో ప్రజలు, రాజకీయ పార్టీ శ్రేణులు సహకరించాలని ఆయన కోరారు.
మరోవైపు టీడీపీ నేత పట్టాభి భార్య పోలీసులపై ఫైర్ అయ్యారు. నిన్న పట్టాభి ని అరెస్టు చేశారు…పోలీసుల నుంచి మాకు ఎటువంటి సమాచారం లేదు…నా భర్త ఎక్కడున్నారనేది ఇంతవరకు తెలియలేదు..మేము మా కురుంబా సభ్యులు ఆందోళన చెందుతున్నాము…నేను డిజిపి కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేస్తానన్నారు. డిజిపి కార్యాలయానికి బయలుదేరిన పట్టాభి భార్యను అడ్డుకుని ఇంట్లోకి తరలించారు పోలీసులు. గన్నవరంలో ఉద్రిక్తత నేపథ్యంలో హైదరాబాదు నుంచి మచిలీపట్నం వెళుతున్న మాజీ మంత్రి కొల్లు రవీంద్రని చిల్లకల్లు టోల్ గేట్ వద్ద అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన్ని విజయవాడ తరలించారు జగ్గయ్యపేట పోలీసులు.
Read Also: Dada Saheb Phalke Awards 2023: అవార్డు విజేతలు వీళ్లే…
తాజావార్తలు
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
-
SS Rajamouli : ‘ఏడ్చి ఏడ్చి కళ్లు ఉబ్బిపోయాయి.. ఫాఫా నటన అద్భుతం’
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!