Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Top Story Krishna Rising First Warning Issued At Prakasam Barrage

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ

Published Date :September 1, 2024 , 7:45 am
By Mahesh Jakki
Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరిక జారీ
  • Follow Us :
  • google news
  • dailyhunt

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీ వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 70 గేట్లను అధికారులను పూర్తిగా ఎత్తివేశారు. సముద్రంలోకి 4,06,490 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. కాలువలకు 500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,06,990 క్యూసెక్కులుగా ఉంది. బ్యారేజీ నీటిమట్టం 12.2 అడుగుల మేర ఉంది. మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేసిన నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. కరకట్ట పొడవునా రీటైనింగ్ వాల్ కారణంగా యనమలకుదురు వరకూ ప్రమాదం తప్పింది. యనమలకుదురు తర్వాత పొలాల వెంబడి కృష్ణానది ప్రవహిస్తోంది. పొలాలలోకి వెళ్లొద్దని రైతాంగాన్ని అధికారులు హెచ్చరించారు.

Read Also: Whats Today: ఈ రోజు ఏమున్నాయంటే?

ఇంకా ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తోంది. రెవెన్యూ, పోలీసు, రక్షణ యంత్రాంగంతో ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు. కరకట్ట వెంబడి ఉన్న గ్రామాలలో ముంపుకు గురయ్యే ప్రాంతాల వారిని తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. నదీ పరీవాహక ప్రాంతంలో ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. కృష్ణా తీరం వెంబడి ఉమ్మడి కృష్ణాజిల్లాలో రక్షణ చర్యలు ముమ్మరం చేశారు. రేపు ఉదయానికి మరింతగా వరద పెరిగే అవకాశం ఉంది. పాములలంక, తోడేలు దిబ్బలంక, పొట్టిలంక, పిల్లిలంక గ్రామాల ప్రజలను ముందుగానే అధికారులను హెచ్చరించారు. పశుగ్రాసం కోసం వరి పొలాలనే వినియోగించాలని అధికారులు సూచించారు. గొర్రెలు, మేకలు వంటి వాటిని ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎంఆర్ఓ కార్యాలయాల వద్దే వీఆర్ఓ, వీఆర్ఏలు ఉన్నారు. ప్రతీ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. ప్రవాహ వేగం పెరిగే అవకాశం ఉండటంతో బోట్లను బయటకు తీయద్దని అధికారులు హెచ్చరించారు. లంక గ్రామాల ప్రజలను ప్రతీక్షణం గమనిస్తున్నామని అధికారులు తెలిపారు. కృష్ణా తీరం వెంబడి ఎలాంటి ముప్పు వాటిల్లకుండా అధికారులు అప్రమత్తంగా ఉన్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • First warning
  • krishna river
  • latest news
  • prakasam barrage

తాజావార్తలు

  • YS Jagan: అమరావతి అవినీతి గని.. MAVIGUN ప్రణాళికే బెస్ట్‌..!

  • Shouryuv: ఆ ఒక్క కారణంతోనే మృణాల్‌ని ఫిక్స్ చేశా.. డైరెక్టర్ శౌర్యువ్ మాటలకు నాని షాక్!

  • Lenin vs Peddi : ‘లెనిన్’ దిగుతున్నాడు.. ‘పెద్ది’ పరిస్థితేంటి? 

  • ACB: రిటైర్డ్ కాబోయే ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ.. ఏసీబీకి చిక్కిన హెడ్మాస్టర్

  • Tesla Struggles in India: భారత్‌లో టెస్లా ఆపసోపాలు.. 7 నెలల్లో కేవలం 342 కార్లే విక్రయం.. దుమ్మురేపుతున్న ఇతర EV కార్లు..!

ట్రెండింగ్‌

  • Vellulli Karam Recipe: వేడివేడి అన్నంలో నెయ్యితో ‘వెల్లుల్లి కారం’ కలిపి తింటే.. ఆ రుచే వేరప్ప..!

  • Vitamin B12 Rich Soups: విటమిన్ B12 లోపం..? ఈ సూప్‌లు తాగితే నరాలు మళ్లీ యాక్టివ్.!

  • Fatty Liver: ఇక ఫ్యాటీ లివర్ సమస్యకు చెక్.. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడే 5 అద్భుత సూత్రాలు..!

  • 144Hz రిఫ్రెష్ రేట్, 7000mAh “టైటాన్ బ్యాటరీ”తో భారత్‌లో Realme NARZO 100 Lite 5G లాంచ్..!

  • JIO Offer: రూ. 339లకే 31 రోజుల వాలిడిటీతో రూ. 35 వేల విలువైన గూగుల్ జెమిని ప్రో ఫ్రీ!

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions