Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
బతికున్న వ్యక్తులు చనిపోయినట్లు నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలు సృష్టించి, వారి స్థలాన్ని కాజేయడానికి ప్రయత్నించిన ఘటన కృష్ణా జిల్లాలో సంచలనంగా మారింది. పెనమలూరు మండలం కానూరు పరిధిలోని సర్వే నంబర్ 36లో జరిగిన ఈ వ్యవహారాన్ని పెనమలూరు పోలీసులు ఛేదించారు. ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పెనమలూరు డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. కబ్జా ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. భూమికి సంబంధించిన పత్రాలు, రిజిస్ట్రేషన్ వివరాలను తరచూ పరిశీలిస్తూ.. ఏదైనా అనుమానాస్పద పరిణామం కనిపిస్తే వెంటనే పోలీసులను సంప్రదించాలని డీఎస్పీ చెప్పారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడ కేదారేశ్వరపేటకు చెందిన బిక్కిన సుబ్బారావు దంపతులకు కానూరులో 1,600 గజాల స్థలం ఉంది. వారి కుమార్తె హిమబిందు ప్రస్తుతం అమెరికాలో ఉంటున్నారు. ఈ విషయాన్ని ఆసరాగా చేసుకున్న విజయవాడకు చెందిన ఓ రియల్ ఎస్టేట్ ముఠా.. అందులో 800 గజాల స్థలాన్ని కాజేయడానికి పథకం వేశారు. ఈ క్రమంలో ముందుగా బాధితుడి స్థలానికి సంబంధించిన డాక్యుమెంట్ల జిరాక్స్ కాపీలను సంపాదించారు. అనంతరం బతికున్న సుబ్బారావు దంపతులు మరణించినట్లు చూపించే నకిలీ మరణ ధ్రువీకరణ పత్రాలను జిరాక్స్ సెంటర్లోనే తయారు చేశారు.
Also Read
- Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
- KTR: గత పది, పదిహేను రోజులుగా ఒకాయనకు నిద్ర పట్టట్లేదు..
- Ragi Health Benefits: రాగి తింటున్నా పోషకాలు అందడం లేదా? మీరు చేసే ఈ చిన్న పొరపాట్లే కారణం!
- Secretariat Employees: సచివాలయ ఉద్యోగుల ఆందోళన.. ధర్నాచౌక్ వద్ద ఉద్రిక్తత!
అమెరికాలో ఉన్న అసలు కుమార్తె హిమబిందు స్థానంలో ప్రకాశం జిల్లాకు చెందిన మరో మహిళను తీసుకొచ్చి, ఆమె పేరిట నకిలీ కుటుంబ సభ్యుల ధ్రువీకరణ పత్రాన్ని కేటుగాళ్లు తయారు చేశారు. ఆ మహిళ ఆధార్‌ను ఉపయోగించి ఈ ఏడాది జనవరిలో మందాడి ఆదిరెడ్డి పేరుతో GPA చేయించి.. అనంతరం ఫిబ్రవరిలో స్థలానికి రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేశారు. అయితే స్థలాన్ని విక్రయించేందుకు ప్రయత్నాలు జరుగుతున్న సమయంలో అసలు యజమాని సుబ్బారావుకు అనుమానం వచ్చింది. దీంతో ఆయన పెనమలూరు పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ నెల 18న కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టి నకిలీ పత్రాల వ్యవహారాన్ని వెలుగులోకి తీసుకొచ్చారు.
ఈ కేసులో మైనంపాటి మణికుమార్‌ను ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించారు. అతడితో పాటు మందాడి ఆదిరెడ్డి, ఉప్పల భాస్కరరావు, ఆర్ఎంపీ శివ, కాసాని అమలేశ్వరరావును అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. ఈ వ్యవహారంలో మరికొందరి ప్రమేయం ఉన్నట్లు అనుమానిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని డీఎస్పీ ధర్మేంద్ర వెల్లడించారు. కేవలం జిరాక్స్ కాపీలను ఆధారంగా చేసుకుని కోట్ల విలువైన భూములను కాజేయడానికి ప్రయత్నిస్తున్న ఇలాంటి ముఠాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా విదేశాల్లో ఉంటున్న ఎన్నారైలు, తమ ఆస్తులకు దూరంగా ఉంటున్న భూ యజమానులు తమ స్థలాలపై ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని పోలీసులు సూచించారు.
తాజావార్తలు
-
Land Fraud: కృష్ణా జిల్లాలో సంచలనం.. ఇలా కూడా స్థలాలు కబ్జా చేస్తారా?
-
PM Modi Mann Ki Baat: సర్జికల్ స్ట్రైక్‌కు 10 ఏళ్లు.. మన్ కీ బాత్‌లో ప్రధాని మోడీ కీలక వ్యాఖ్యలు
-
Virat Kohli Records: 110 పరుగులు, 2 సెంచరీలు.. సచిన్ నాలుగు రేర్ రికార్డులపై ‘కింగ్’ కోహ్లీ కన్ను!
-
Why Do Dogs Howl at Night: రాత్రిపూట కుక్కలు ఎందుకు ఏడుస్తాయి? దెయ్యాలు కనిపిస్తాయా?.. అసలు రహస్యం ఇదే!
-
Vaibhav Sooryavanshi: పోల్చుకోవడానికి ఏముంది?.. వైభవ్‌పై ఎలాంటి జెలసీ లేదు.. టీమిండియా స్టార్ సంచలన వ్యాఖ్యలు!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?