Site icon NTV Telugu

Kottu Satyanarayana : వారాహి దేవి అనుగ్రహం కలగాలంటే పవన్ కళ్యాణ్ ధర్మం పక్షం వహించాలి

Kottu Satyanarayana

Kottu Satyanarayana

పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో మంత్రి కొట్టు సత్యనారాయణ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఎన్నికల వాతావరణం వచ్చేసినట్టుగా కొన్ని రాజకీయ పార్టీలు హడావుడి పడిపోతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి దైవభక్తి పరాయనుడని, ఆయన తలపెట్టిన ప్రతి కార్యక్రమం వెనుక భగవంతుని ఆశీస్సులు ఉన్నాయని ఆయన వెల్లడించారు. భగవంతుడు 2014 నుండి రావాల్సిన నిధుల వరద పారిస్తున్నాడని, ఢిల్లీ వెళ్ళి రాష్ట్రం ప్రజల కోసం ప్రధానమంత్రికి చేసిన విజ్ఞాపనలు విని సహృదయంతో నిధులు ఇస్తున్నారన్నారు. అమ్మవారి పేరుతో ఉన్న వాహనం ఎక్కి అసత్యాలు పలుకుతూ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు కోసం పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగానూ ఫలించవన్నారు. వ్యక్తిగత స్వార్థం కోసం చంద్రబాబును ఆశ్రయించిన అతని విధానాన్ని తప్పుపడుతున్నామని ఆయన వ్యాఖ్యానించారు. ఒక సామాజిక వర్గాన్ని అడ్డుపెట్టుకుని, ఆ సామాజిక వర్గానికి అన్యాయం చేసేలాగా మాట్లాడే ప్రతి మాటని ఖండిస్తున్నామని కొట్టు సత్యానారాయణ తెలిపారు. నువ్వు స్థాపించిన పార్టీ సిద్ధాంతపరంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేయాలని హితవు పలికారు. వారాహి దేవి అనుగ్రహం కలగాలంటే పవన్ కళ్యాణ్ ధర్మం పక్షం వహించాలన్నారు కొట్టు సత్యనారాయణ.

Also Read : Prabhas: ప్రభాస్ కి ఎవర్రా ఎదురొచ్చేది… డైనోసర్ అక్కడ

ఇదిలా ఉంటే.. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ వారాహి యాత్ర మొదటి షెడ్యూల్‌ ముగిసిన విషయం తెలిసిందే. అయితే.. తాజాగా రెండో విడత వారాహి విజయ యాత్రను ఆదివారం (జులై9,2023) ఏలూరు నగరం నుంచి ప్రారంభించనున్నట్లుగా జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. అదే రోజు సాయంత్రం ఏలూరులో బహిరంగసభ ఉంటుందని జనసేన పార్టీ పేర్కొంది. 9న సాయంత్రం 5గంటలకు పవన్ కల్యాణ్‌ బహిరంగసభతో యాత్రను మొదలుపెట్టనున్నారని జనసేన తెలిపింది. ఈసారి యాత్ర పశ్చిమ గోదావరి జిల్లా పరిసర నియోజకవర్గాల్లో జరుగనుండటంతో ఏర్పాట్లు చేస్తున్నారు జనసైనికులు.

Exit mobile version