Koti Deepotsavam Day-7: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఆరంభమైన కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. ఇల కైలాసంలో జరిగే కోటి దీపాల పండుగను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.. ఇక, ఆరో రోజు కోటిదీపోత్సవం కన్నుల పండుగా సాగింది.. కాగా.. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శంఖారావంతో ప్రారంభమైన ఏడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం దిగ్విజయంగా ముగిసింది. వర్గల్‌కు చెందిన శ్రీశారదా వైదిక వేదపాఠశాల వారిచే వేదపఠనం జరిగింది. కార్తిక పున్నమి వెలుగుల్లో ప్రదోషకాల అభిషేకం, రామాచారి బృందం భక్తి గీతాలు, మీనాక్షి అంబటిపూడి బృందం వయోలిన్ వాయిద్య విన్యాసం అందరినీ ఆకట్టుకుంది.
అయితే.. కోటి దీపోత్సవంలో ఏడవ రోజు మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం భక్త కోటిని ఆకర్షించింది. వేదికపైకి అరుణాచలం ఉత్సవమూర్తుల ఆగమనం.. ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి – పుష్పార్చన, కార్తికపూర్ణిమ శుభవేళ స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన, అనంతకోటి పుణ్యఫలం.. అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణోత్సవం, సకల శుభాలను అనుగ్రహించే జ్వాలాతోరణ దర్శనభాగ్యం, కార్తిక పున్నమి వెలుగుల్లో భక్తుల మధ్యలో తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి దంపతులు సందడి చేశారు. అంతేకాకుండా.. మైసూరు అవధూత దత్తపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణం, పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన జరిగింది. ఇల కైలాసంలో కార్తిక పౌర్ణమి శుభవేళ సామూహిక దీపారాధన చేయడం వలన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. నిండు పున్నమి వెలుగుల్లో స్వర్ణ లింగోద్భవ దర్శనం.. మహాద్భుతంగా చెప్పవచ్చు. సకల పాపాలను హరించే సప్త హారతులు దర్శనంతో భక్తులు పుణీతులయ్యారు. కార్తిక పౌర్ణమి శుభసమయాన పరమాద్భుతమైన మహాదేవుని మహా నీరాజనం.. మైసూరు అవధూత దత్తపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి గురు వందనం.. రాజు బృందం కాంతార నృత్యం, ఫ్యూజన్ నృత్యం, జుగల్బంది నృత్యం, పుణే డోలు విన్యాసం, సాంస్కృతిక కదంబం (కోలాటం) భక్తులను అలరించాయి.
ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.. ఈ నెల 14వ తేదీన ప్రారంభం.. ఈ నెల 27వ తేదీతో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది..