Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Telangana News Koti Deepotsavam Day 7 Hyderabad Ntr Stadium

Koti Deepotsavam Day-7: కార్తికపూర్ణిమ శుభవేళ స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన

Published Date :November 15, 2024 , 11:31 pm
By Gogikar Sai Krishna
  • అంగరంగ వైభవంగా కోటి దీపోత్సవం
  • భారీ సంఖ్యలో తరలివస్తున్న భక్తులు
  • ఏడవ రోజు విశేష కార్యక్రమాలు ఇవే
Koti Deepotsavam Day-7: కార్తికపూర్ణిమ శుభవేళ స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన
  • Follow Us :
  • google news
  • dailyhunt

Koti Deepotsavam Day-7: హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఆరంభమైన కోటిదీపోత్సవం అంగరంగ వైభవంగా సాగుతోంది.. ఇల కైలాసంలో జరిగే కోటి దీపాల పండుగను తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. హైదరాబాద్‌తో పాటు తెలుగు రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ఈ దీపయజ్ఞంలో భాగస్వాములు అవుతున్నారు.. ఇక, ఆరో రోజు కోటిదీపోత్సవం కన్నుల పండుగా సాగింది.. కాగా.. ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శంఖారావంతో ప్రారంభమైన ఏడవ రోజు కోటి దీపోత్సవ మహోత్సవం దిగ్విజయంగా ముగిసింది. వర్గల్‌కు చెందిన శ్రీశారదా వైదిక వేదపాఠశాల వారిచే వేదపఠనం జరిగింది. కార్తిక పున్నమి వెలుగుల్లో ప్రదోషకాల అభిషేకం, రామాచారి బృందం భక్తి గీతాలు, మీనాక్షి అంబటిపూడి బృందం వయోలిన్ వాయిద్య విన్యాసం అందరినీ ఆకట్టుకుంది.

అయితే.. కోటి దీపోత్సవంలో ఏడవ రోజు మహాసహస్రావధాని డా. గరికిపాటి నరసింహారావు గారి ప్రవచనామృతం భక్త కోటిని ఆకర్షించింది. వేదికపైకి అరుణాచలం ఉత్సవమూర్తుల ఆగమనం.. ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి – పుష్పార్చన, కార్తికపూర్ణిమ శుభవేళ స్వర్ణలింగానికి రజత బిల్వార్చన, అష్టోత్తరశత స్వర్ణపుష్పార్చన, అనంతకోటి పుణ్యఫలం.. అరుణాచలం శ్రీ అరుణాచలేశ్వర స్వామి కల్యాణోత్సవం, సకల శుభాలను అనుగ్రహించే జ్వాలాతోరణ దర్శనభాగ్యం, కార్తిక పున్నమి వెలుగుల్లో భక్తుల మధ్యలో తిరువణ్ణామలై శ్రీ అరుణాచలేశ్వర స్వామి దంపతులు సందడి చేశారు. అంతేకాకుండా.. మైసూరు అవధూత దత్తపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి అనుగ్రహ భాషణం, పీఠాధిపతి, అతిథులు, ఛైర్మన్ దంపతులచే కార్తికదీపారాధన జరిగింది. ఇల కైలాసంలో కార్తిక పౌర్ణమి శుభవేళ సామూహిక దీపారాధన చేయడం వలన ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలుగుతాయని ప్రగాఢ విశ్వాసం. నిండు పున్నమి వెలుగుల్లో స్వర్ణ లింగోద్భవ దర్శనం.. మహాద్భుతంగా చెప్పవచ్చు. సకల పాపాలను హరించే సప్త హారతులు దర్శనంతో భక్తులు పుణీతులయ్యారు. కార్తిక పౌర్ణమి శుభసమయాన పరమాద్భుతమైన మహాదేవుని మహా నీరాజనం.. మైసూరు అవధూత దత్తపీఠం పూజ్యశ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి గురు వందనం.. రాజు బృందం కాంతార నృత్యం, ఫ్యూజన్ నృత్యం, జుగల్బంది నృత్యం, పుణే డోలు విన్యాసం, సాంస్కృతిక కదంబం (కోలాటం) భక్తులను అలరించాయి.

ఇదిలా ఉంటే.. సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 9.30 వరకు ఎన్టీఆర్ స్టేడియం దీపాల కాంతులతో వెలిగిపోయింది. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభంకానున్న కోటిదీపోత్సవం మహాయజ్ఞంలో పాల్గొనాల్సింది సాదరంగా ఆహ్వానం పలుకుతోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనతి టీవీ.. ఈ నెల 14వ తేదీన ప్రారంభం.. ఈ నెల 27వ తేదీతో ముగియనున్న ఈ దీపయజ్ఞంలో పాల్గొనే భక్తులకు పూజాసామగ్రి, దీపారాధన వస్తువులను రచన టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పూర్తిగా ఉచితంగా అందిస్తోంది..

 

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Arunaachalam
  • Bhakti Geetalu
  • Cultural Performance
  • Cultural Programs koti-deepotsavam-2024
  • Day 7

తాజావార్తలు

  • US-Iran War: “మేము మీలా క్రూరులం కాదు”.. అమెరికన్ పైలట్ తల్లి బాధపై స్పందించిన ఇరాన్..

  • SRH: సన్ రైజర్స్ హైదరాబాద్‌కు బిగ్ షాక్.. ఇంటికెళ్లిపోయిన స్టార్ ప్లేయర్..

  • Minister Atchannaidu: గతంలో మూడు ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టారు..! ఇప్పుడు ‘మావిగన్’ పేరుతో జగన్‌ మరో నాటకం..!

  • Varanasi: క్లైమాక్స్‌కు చేరువలో ‘వారణాసి’..హైదరాబాద్ శివార్లలో షూటింగ్

  • Iran War: యూఏఈపై 450 క్షిపణి, 2,000 డ్రోన్ దాడులు.. అయినా యూఏఈ ఇరాన్‌తో ఎందుకు పోరాడటం లేదు..?

ట్రెండింగ్‌

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • Fuel price: పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగితే.. ఆ ఎఫెక్ట్‌ ఎలా ఉంటుందో తెలుసా?.. షాకింగ్ రిపోర్టు..

  • 6.8 అంగుళాల భారీ TFT LCD స్క్రీన్‌, 7,000mAh బ్యాటరీతో Honor Play 80 Pro లాంచ్..!

  • స్లిమ్ డిజైన్.. పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్.. 100MP కెమెరాతో Honor X80i లాంచ్.. ధర ఎంతంటే.?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions