Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
- వైభవంగా శ్రీ తులసీ దామోదర కల్యాణం
- నరసింహస్వామి మహాభిషేకం, రక్షాకంకణపూజ
- భక్తులను అలరించిన పీఠాధిపతుల ప్రవచనాలు
- కోటి దీపోత్సవ నిర్వాహకులకు కిషన్ రెడ్డి ప్రశంసలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కార్తీక మాసం సందర్భంగా హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటి దీపోత్సవం–2026 వేడుకలు భక్తిభావంతో కొనసాగుతున్నాయి. స్టేడియం పరిసరాలు శివనామస్మరణతో మార్మోగుతుండగా, శనివారం (నవంబర్ 21) ఎనిమిదో రోజు వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. కార్తీక శనివారం, కృష్ణపక్ష ద్వాదశి పర్వదినాన జరిగిన ఈ వేడుకల్లో పీఠాధిపతుల అనుగ్రహ భాషణాలు, ప్రవచనాలు, ప్రత్యేక పూజలు, శ్రీ తులసీ దామోదర కల్యాణోత్సవం భక్తులను భక్తి పారవశ్యంలో ముంచెత్తాయి.
విశేష పూజలు.. తులసీ దామోదర కల్యాణం
ఎనిమిదో రోజు కార్యక్రమాల్లో భాగంగా వేదికపై నరసింహస్వామి మహాభిషేకం, స్వర్ణసింహ రక్షాకంకణపూజ, ఉజ్జయిని మహాకాళి భస్మహారతి వైభవంగా నిర్వహించారు. భక్తుల చేతుల మీదుగా నరసింహస్వామి విగ్రహాలకు రక్షాకంకణపూజ జరిపారు. అనంతరం జరిగిన శ్రీ తులసీ దామోదర కల్యాణోత్సవం, పల్లకి వాహన సేవ, స్వర్ణ లింగోద్భవం, సప్త హారతులు భక్తులకు కనులపండువగా నిలిచాయి.
Also Read
- Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
- Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
- OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
- OTR: రేఖా నాయక్ రైస్ మిల్ పై ఈడీ దాడులు.. సొంత పార్టీ నేతలే కుట్ర చేశారా?
పీఠాధిపతుల సందేశాలు.. ప్రవచనామృతం
ఈ వేడుకల్లో బెంగళూరు శ్రీ కైలాష్ ఆశ్రమం పీఠాధిపతి శ్రీ జయేంద్రపురి మహాస్వామీజీ, హరిద్వార్ జూనా అఖాడాకు చెందిన శ్రీ ఉమాకాంతానంద సరస్వతీ స్వామీజీ భక్తులకు అనుగ్రహ భాషణాలు అందించారు. ఆధ్యాత్మిక ప్రవచనకర్త శ్రీ డి. హయగ్రీవాచార్యులు చేసిన ప్రవచనామృతం శ్రోతలను ఆకట్టుకుంది.
కిషన్ రెడ్డి ప్రసంగం.. నిర్వాహకులపై ప్రశంసలు
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి మాట్లాడుతూ, భక్తి టీవీ, ఎన్టీవీ, వనిత టీవీల అధినేత నరేంద్ర చౌదరిని, వారి బృందాన్ని అభినందించారు. భారత్ కేవలం భౌగోళిక దేశం కాదని, సనాతన ధర్మానికి, ఆధ్యాత్మికతకు నిలయమని పేర్కొన్నారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో చేసే స్నానాలు, దీపారాధనలు, పూజలు మనిషిలో భక్తిని, క్రమశిక్షణను పెంచుతాయని చెప్పారు. తమసోమా జ్యోతిర్గమయ అన్న ఉపనిషత్ వాక్యం ప్రకారం దీపం చీకటిని పోగొట్టడమే కాకుండా అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ఇస్తుందని వివరించారు. కోటి దీపాలు వెలిగించడం అంటే కోట్లాది హృదయాలలో భక్తి భావాన్ని మేల్కొల్పడమేనని, ఇదొక గొప్ప ఆధ్యాత్మిక యజ్ఞమని అభివర్ణించారు. భాగ్యనగర ప్రజలకు ఈ వేడుక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తోందని, క్రమశిక్షణతో పాల్గొంటున్న భక్తులను ప్రశంసించారు. రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ ఉత్సవాలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
Pics Of #Rangoli & floral decorations @ #BhakthiTV #KarthikaDeepotsavam2026, Day-8
#BhakthiTV #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/LogQX6WHUN
— BhakthiTV (@BhakthiTVorg) November 21, 2026
కోటి దీపోత్సవం-2026, 8వ రోజు ఉత్సవంలో భాగంగా వేదిక పై వేదికపై ఉజ్జయిని మహాకాళేశ్వర అభిషేకం..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/iGnNbOnMyJ
— BhakthiTV (@BhakthiTVorg) November 21, 2026
Central Minister Shri G. Kishan Reddy garu @ Bhakthi TV Kotideepotsavam-2026
#KishanReddy #BhakthiTV #Kotideepotsavam2026 #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం
@kishanreddybjp @KishanReddyOfc @BJP4Telangana @BJP4India https://t.co/EQQnYLbTVV— BhakthiTV (@BhakthiTVorg) November 21, 2026
కోటిదీపోత్సవం-2026, 8వ రోజు ఉత్సవంలో భాగంగా వేదికపై ఉజ్జయిని మహాకాళేశ్వర భస్మహారతి..
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/nUuptTdEqU
— BhakthiTV (@BhakthiTVorg) November 21, 2026
కోటిదీపోత్సవం-2026 8వ రోజు ఉత్సవంలో భాగంగా స్వర్ణలింగోద్భవం.
#BhakthiTV #Kotideepotsavam2026 #NTVTelugu #Hyderabad #Karthikamasam #Kotideepotsavam #కోటిదీపోత్సవం2026 #కోటిదీపోత్సవం https://t.co/wrYRAM85QV
— BhakthiTV (@BhakthiTVorg) November 21, 2026
తాజావార్తలు
-
Koti Deepotsavam 2026 : కోటి దీపోత్సవంలో అద్భుత ఘట్టం.. వైభవంగా తులసీ దామోదర కల్యాణం.!
-
Yuzvendra Chahal: రాజకీయాల్లోకి అడుగుపెట్టిన భారత క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్.. కీలక బాధ్యతలు అప్పగింత..
-
Asaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!
-
OTR: రాజాం మున్సిపాలిటీలో జనసేనకు సొంత పార్టీ సెగ.. టీడీపీ నేతల అలక
-
OTR: వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనన్న సుదర్శన్ రెడ్డి.. వైరాగ్యమా? అసంతృప్తా?
ట్రెండింగ్
-
Microwave Cleaning Hacks : ఓవెన్లో మొండి మరకలా బెడదా.?.. 5 నిమిషాల ట్రిక్‌తో క్లీనింగ్ ఈజీ
-
Traditional Indian Textile Recycling : పాత చీరలతో కొత్త మ్యాజిక్.. మన అమ్మమ్మల ఫ్యాషన్ సీక్రెట్.!
-
Best Winter Destinations in India : వింటర్ ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా?.. ఈ 10 ప్రదేశాలు మిస్ కావొద్దు.!
-
Curry Leaves Pickle: కమ్మని రుచితో, నెలల తరబడి నిల్వ ఉండే ‘కరివేపాకు పచ్చడి’.. వేడి వేడి అన్నంలోకి తింటే వావ్ అనాల్సిందే..!
-
Ambati Rayudu: హైదరాబాద్ ఆటగాళ్లకు ఎప్పుడూ అన్యాయమేనా..? ముంబై ఆటగాళ్లపై సంచలన వ్యాఖ్యలు..!