Site icon NTV Telugu

Koti Deepotsavam 2025: కోటి దీపోత్సవం వేదికన రామేశ్వరం శ్రీ రామనాథస్వామి కల్యాణం.. నేడు ప్రత్యేక పూజలు ఇలా..!

Koti Deepotsavam 2025

Koti Deepotsavam 2025

Koti Deepotsavam 2025: భక్తి, ఆరాధన, ఆధ్యాత్మికతల సమ్మేళనంగా ఏటా కార్తీకమాసంలో ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీల ఆధ్వర్యంలో నిర్వహించే కోటి దీపోత్సవం 2025 వేడుకలు హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో కన్నుల పండువగా కొనసాగుతున్నాయి. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలకు మొదటి రెండు రోజులు పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చి దీపాలు వెలిగించారు. 2012లో లక్ష దీపోత్సవంగా మొదలై, 2013లో కోటి దీపోత్సవంగా మారి భక్తుల మదిలో అఖండ జ్యోతిగా వెలుగొందుతున్న ఈ దీపాల పండుగ, కార్తిక మాసానికి నూతన వైభవాన్ని తీసుకువస్తోంది. ఈ మహాక్రతువులో గురువులు, పీఠాధిపతులు, మఠాధిపతులు పాల్గొంటున్నారు.

What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?

ఇందులో భాగంగా నవంబర్ 3, 2025 (కార్తీక సోమవారం – ప్రదోష వ్రతం) రోజున మూడవ రోజు విశేష కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ రోజున అనుగ్రహ భాషణంగా జగద్గురు శ్రీశ్రీశ్రీ అభినవ విద్యాశంకర భారతీ మహాస్వామీజీ (శ్రీశ్రీశ్రీ జగద్గురువుగారి శంకరాచార్య మహాసంస్థానం పీఠాధిపతులు) వారు ఆశీర్వచనమివ్వనున్నారు. అలాగే శ్రీశ్రీశ్రీ గోవిందానంద సరస్వతీ మహాస్వామీజీ (శ్రీ భాగవతీయ జగద్గురు శంకరాచార్య శ్రీ బాలకృష్ణానంద సరస్వతీపీఠం, శుక శంకర పీఠం) కూడా అనుగ్రహ భాషణం చేయనున్నారు.

Womens World Cup 2025 : భారత్ విజయ దుందుభి.. సాధించార్రా మనోళ్లు..

ఇక ప్రవచనం బ్రహ్మశ్రీ డా.పుల్లెలవకు శ్రీనివాసరావుచే ఉంటుంది. ఈరోజు వేదికపై పూజగా వారణాసి శ్రీ విశ్వనాథునికి కోటి బిల్వార్చన, అద్భుతరీతిలో కాశీ సప్తఋషి హారతిని నిర్వహించగా, భక్తులచే పూజగా శివలింగాలకు కోటి బిల్వార్చన ఉంటుంది. కల్యాణంగా రామేశ్వరం శ్రీ రామనాథస్వామి కల్యాణం అత్యంత వైభవంగా జరగనుంది. ఈ శుభదినాన భక్తులకు మయూర వాహనంపై స్వామివారి దర్శనం లభించనుంది.

Exit mobile version