Koti Deepotsavam 2024 Day 2: వైభవంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి కళ్యాణం

  • రెండో రోజు ఘనంగా ముగిసిన కోటి దీపోత్సవం
  • వైభవంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామి కళ్యాణం
  • నంది వాహనంపై దర్శనమిచ్చిన ఆది దంపతులు
Koti Deepotsavam 2024

Koti Deepotsavam 2024

Koti Deepotsavam 2024 Day 2: ఎన్టీవీ-భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి దీపోత్సవం రెండో రోజు ఘనంగా ముగిసింది. ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా ఈ కార్యక్రమం అంగరంగ వైభవంగా కొనసాగింది. కోటి దీపోత్సవం కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో హాజరై ఆ పరమశివుడి సేవలో పాల్గొన్నారు. అంతేకాకుండా.. దీపాలను వెలిగించి తమ భక్తిని చాటుకున్నారు. పిల్లా, పెద్ద అని తేడా లేకుండా ఈ కార్యక్రమంలో పాల్గొని రెండో రోజు విజయవంతం చేశారు.

Read Also: Koti Deepotsavam Day 2 LIVE : నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన, వేములవాడ శ్రీ రాజరాజేశ్వర కల్యాణం

కోటి దీపోత్సవం 2024లో నేడు రెండో రోజు. నేడు విశేష కార్యక్రమాలు జరిగాయి. శ్రీ సిద్ధేశ్వరానంద భారతి స్వామీజీ (శ్రీ సిద్ధేశ్వరీ పీఠం, కుర్తాళం), రమ్యానంద భారతి మాతాజీ (శ్రీ శక్తిపీఠం, తిరుపతి) గార్లు అనుగ్రహ భాషణం చేశారు. శ్రీ నండూరి శ్రీనివాస్ గారు ప్రవచనామృతం వినిపించారు. వేదికపై నర్మదా బాణలింగానికి కోటి భస్మార్చన, భక్తులచే స్వయంగా శివలింగాలకు కోటి భస్మార్చన, కోటి దీపోత్సవం వేదికపై వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉంటుంది. అనంతరం నంది వాహనంపై ఆదిదంపతులు దర్శనం ఇచ్చారు. చివరలో సప్త హారతి, లింగోద్భావంతో రెండోరోజు కోటి దీపోత్సవం వేడుక విజయవంతంగా ముగిసింది.