Koti Deepotsavam 2023 8th Day: ఈ నెల 14వ తేదీన ప్రారంభమైన దీపయజ్ఞం కోటిదీపోత్సవం ఎనిమిదో రోజుకు చేరింది.. ‘దీపం జ్యోతిః పరంబ్రహ్మ.. దీపం సర్వతమోపహం.. దీపేన సాధ్యతే సర్వం.. సంధ్యాదీప నమోస్తుతే..” అంటారు.. ఒక దీపమే మరో దీపాన్ని వెలిగించగలదు.. దీపం పక్కనే దీపాన్ని వెలిగిస్తే ఆ దీపాల వరుసకు లోకమంతా వెలుగులమయం అవుతుంది.. అదే ఒకే చోట కోటి దీపాలను వెలిగించి.. ఉత్సవాన్ని నిర్వహిస్తూ వస్తోంది ఎన్టీవీ, భక్తి టీవీ, వనిత టీవీ.. లక్ష దీపాలతో ప్రారంభమైన ఈ మహా యజ్ఞం కోటికి చేరుకుని.. తెలుగు రాష్ట్రాలలోని భక్తుల నుంచి నీరాజనాలు అందుకుంటుంది..