NTV Telugu Site icon

Koti Deepotsavam 2023 10th Day: ఇల కైలాసాన్ని తలపించిన రామభక్తి సామ్రాజ్యం.. ఘనంగా ఒంటిమిట్ట రామయ్య కల్యాణం

Koti

Koti

ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు. రోజుకు ఒక కార్యక్రమంతో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు సాగిన కోటిదీపోత్సవం వేదిక.. శ్రీరాముని రాకతో మరింత వెలుగులు నింపింది.

Tirumala: రేపు ఉదయం రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల

ఈరోజు కోటిదీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలు చూసుకుంటే.. ఎంతో చక్కగా ఇల కైలాసంలో రామభక్తి సామ్రాజ్యాన్ని తలపించింది. అంతేకాకుండా.. ఈ వేదికపై ఒంటిమిట్ట రామయ్య, కొండగట్టు అంజన్న సాక్షాత్కారం కన్నుల పండవగా సాగింది. సకలాభీష్టప్రదాయకం భక్తులచే ఆంజనేయస్వామికి కోటితమలపాకుల అర్చన కార్యక్రమం జరిపించారు. కమనీయం కడు రమణీయంలా శ్రీ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కల్యాణం చూసి భక్తులు ఎంతో మైమరచిపోయారు. ఆ తర్వాత.. హనుమంత వాహనంపై జనకీరాముల వైభోగం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. కంచి కామాక్షి, కొల్హాపూర్‌ మహాలక్ష్మి దర్శనభాగ్యం కల్పించారు. ఇస్కాన్‌ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మహాభిషేకం చేశారు. ఇస్కాన్‌ విశాఖపట్నం మాతా నితాయి సేవని అనుగ్రహభాషణం జరిపించారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం ఆలపించారు. వీటన్నింటితో పాటు అబ్బురపరిచే కళాసంబరాలు, అంబరాన్నంటే మహానీరాజనాలు ఎంతో ఘనంగా జరిగాయి. చివరకు కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులతో 10వ రోజు కోటి దీపోత్సవం ఘనంగా ముగిసింది.

Rani Rudrama: కేటీఆర్ను గద్దె దించి సిరిసిల్లలో నన్ను గెలిపించండి

ఇలా ఎన్నో విశేషాలకు వేదికైన కోటిదీపోత్సవానికి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌.. భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేయడం జరుగుతోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే దీప యజ్ఞంలో పాల్గొనండి..

Show comments