Koti Deepotsavam 2023 10th Day: ఇల కైలాసాన్ని తలపించిన రామభక్తి సామ్రాజ్యం.. ఘనంగా ఒంటిమిట్ట రామయ్య కల్యాణం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఎన్టీవీ, భక్తి టీవీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న కోటిదీపోత్సవం అద్భుతంగా కొనసాగుతోంది.. దీపాల కాంతులతో ఇల కైలాసాన్ని తలపిస్తోంది. ఈ మహోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకుని భక్తిలో మునిగిపోతున్నారు. రోజుకు ఒక కార్యక్రమంతో కోటి దీపోత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ నెల 27వ తేదీ వరకు కొనసాగనున్న ఈ దీపయజ్ఞంలో ప్రతీ రోజు విశేష కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు కోటి దీపోత్సవంలో భాగంగా.. ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణోత్సవం అత్యంత కమనీయంగా జరిగింది. ఇప్పటికే తొమ్మిది రోజుల పాటు సాగిన కోటిదీపోత్సవం వేదిక.. శ్రీరాముని రాకతో మరింత వెలుగులు నింపింది.
Tirumala: రేపు ఉదయం రూ.300ల ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల కోటా విడుదల
Also Read
- Luxury Sneakers: జెన్ జీ, మిలీనియల్స్‌ను తెగ ఆకర్షిస్తున్న స్నీకర్స్.. అంత స్పెషల్ ఏంటో తెలుసా..?
- KL Rahul: సెంచరీ చేసినా ఉపయోగం లేదు.. అలా జరిగినందుకు బాధగా ఉంది..
- Pujara Playing XI: వెస్టిండీస్‌తో టీ20 సిరీస్.. వైభవ్ సూర్యవంశీకి దక్కని చోటు..
- AP Govt: రేపు ఏపీలో ‘అమరజీవి జలధార’కు శ్రీకారం.. 27.36 లక్షల కొత్త కుళాయి కనెక్షన్లు..
ఈరోజు కోటిదీపోత్సవంలో జరిగిన కార్యక్రమాలు చూసుకుంటే.. ఎంతో చక్కగా ఇల కైలాసంలో రామభక్తి సామ్రాజ్యాన్ని తలపించింది. అంతేకాకుండా.. ఈ వేదికపై ఒంటిమిట్ట రామయ్య, కొండగట్టు అంజన్న సాక్షాత్కారం కన్నుల పండవగా సాగింది. సకలాభీష్టప్రదాయకం భక్తులచే ఆంజనేయస్వామికి కోటితమలపాకుల అర్చన కార్యక్రమం జరిపించారు. కమనీయం కడు రమణీయంలా శ్రీ ఒంటిమిట్ట కోదండరాముని కల్యాణం ఘనంగా జరిగింది. ఈ కల్యాణం చూసి భక్తులు ఎంతో మైమరచిపోయారు. ఆ తర్వాత.. హనుమంత వాహనంపై జనకీరాముల వైభోగం నిర్వహించారు. ఇదిలా ఉంటే.. కంచి కామాక్షి, కొల్హాపూర్ మహాలక్ష్మి దర్శనభాగ్యం కల్పించారు. ఇస్కాన్ బృందం ఆధ్వర్యంలో శ్రీకృష్ణ మహాభిషేకం చేశారు. ఇస్కాన్ విశాఖపట్నం మాతా నితాయి సేవని అనుగ్రహభాషణం జరిపించారు. బ్రహ్మశ్రీ నోరి నారాయణమూర్తి ప్రవచనామృతం ఆలపించారు. వీటన్నింటితో పాటు అబ్బురపరిచే కళాసంబరాలు, అంబరాన్నంటే మహానీరాజనాలు ఎంతో ఘనంగా జరిగాయి. చివరకు కోటిదీపాల వెలుగులు, సప్తహారతుల కాంతులతో 10వ రోజు కోటి దీపోత్సవం ఘనంగా ముగిసింది.

Rani Rudrama: కేటీఆర్ను గద్దె దించి సిరిసిల్లలో నన్ను గెలిపించండి
ఇలా ఎన్నో విశేషాలకు వేదికైన కోటిదీపోత్సవానికి భక్తులను సాదరంగా ఆహ్వానిస్తోంది రచనా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్.. భక్తులకు పూజా సామగ్రిని ఉచితంగా అందజేయడం జరుగుతోంది.. హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియం వేదికగా సాయంత్రం 5.30 గంటలకు ప్రారంభమయ్యే దీప యజ్ఞంలో పాల్గొనండి..
తాజావార్తలు
-
Primebook 3 Max: రూ.35,990కే కొత్త ల్యాప్‌టాప్.. 12 గంటల బ్యాటరీ, 8GB RAM, AI ఫీచర్లతో Primebook 3 Max
-
Aadarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’ మళ్లీ వాయిదా.. కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడంటే?
-
Tragedy : ట్యాంక్‌బండ్‌పై విషాదం.. పుట్టినరోజు వేడుకల్లో రెండు ప్రాణాలు బలి..
-
Tamil Nadu Bypolls: తమిళనాడు ఉప ఎన్నికల్లో బిగ్ ఫైట్.. విజయ్ వర్సెస్ స్టాలిన్.!
-
Suvendu Adhikari on UCC: UCCపై సువేందు అధికారి కీలక ప్రకటన.. 6 నెలల్లో ‘లవ్ జిహాద్’, ‘ల్యాండ్ జిహాద్’ చట్టాలు!
ట్రెండింగ్
-
World Teachers Day 2026 : చాట్‌జీపీటీ అన్నీ చెప్పేస్తుందా.. మరి టీచర్ ఎందుకు కావాలి.?
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!