Kotha Prabhakar Reddy Calls Medak Minister Useless: దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, మంత్రులు దామోదర రాజనర్సింహ, వివేక్‌లను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మెదక్ జిల్లాకి ఓ పనికి మాలిన మంత్రి ఉన్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇంట్లో నుంచి బయటికి రాడని.. కమీషన్లు, పర్స౦టేజీల గురించి మాత్రమే పట్టించుకుంటాడని విమర్శించారు. జిల్లా మంత్రి ఒకరైతే.. జిల్లా మీద పెత్తనం చేలాయించేటాయన ఇంకో జిల్లావారు అంటూ మండిపడ్డారు. రైతు ధర్నాలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం, మంత్రులపై ఫైర్ అయ్యారు.
‘మెదక్ జిల్లాకి ఓ పనికి మాలిన మంత్రి ఉన్నాడు. ఇంట్లో నుంచి బయటికి రాడు కానీ.. కమీషన్లు, పర్స౦టేజీల గురించి మాత్రమే పట్టించుకుంటాడు. మన జిల్లా మంత్రి ఒకడైతే.. జిల్లా మీద పెత్తనం చేలాయించేటోడు ఇంకో జిల్లావాడు. వేరే జిల్లా వాడికి మన జిల్లా గురించి ఏం తెలుసు. మంత్రులు పర్స౦టేజీలు తీసుకుని.. తనకి ఇవ్వడం లేదని జగ్గారెడ్డి ఏడుస్తున్నాడు. కాంగ్రెస్ కార్యకర్తల కంటే మెదక్ జిల్లా కలెక్టర్ బాగా మాట్లాడుతున్నాడు. గాంధీ భవన్ నుంచి స్క్రిప్ట్ వస్తే బాగా చదువుతున్నాడు. కలెక్టర్‌కి ఇంత కూడా సిగ్గు శరం లేకుండా పోయింది’ అని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
Also Read: Asia Cup 2025: నలుగురు స్టార్స్ రీఎంట్రీ.. ఆసియా కప్ 2025కు ఊహించని స్వ్కాడ్!
ఉత్తమ్ కుమార్ రెడ్డి ఓ దిక్కుమాలిన మంత్రి అని, జిల్లా ప్రాజెక్టులపై ఒక్క రోజు కూడా రివ్యూ చేయలేదు అని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మండిపడ్డారు. కొత్త ప్రభాకర్ రెడ్డి ఇలా సంచలన వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి ఏం కాదు. గతంలో చాలాసార్లే ప్రభుత్వంపై మండిపడ్డారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టాలని రియల్టర్లు చూస్తున్నారని, ఎంత ఖర్చయినా పర్లేదు ఆ డబ్బులు తాము ఇస్తామని చెప్పారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి.
