Site icon NTV Telugu

KotamReddy Sridhar Reddy: నమ్మకద్రోహం మాటకు బాధేసింది

kotam reddy1

Collage Maker 03 Feb 2023 10.44 Am

నెల్లూరు రాజకీయం వేడెక్కింది. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి స్వంత పార్టీ పై తిరుగుబాటు బావుటా ఎగరేశారు. తనపై నిఘా పెట్టారని, తన ఫోన్ ట్యాప్ చేశారని ఆరోపించారు కోటంరెడ్డి. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై మాజీ మంత్రి అనిల్ కుమార్ విరుచుపడ్డారు. దమ్ముంటే రాజీనామా చేయాలని సవాల్ చేశారు. ఇద్దరం స్పీకర్ ఫార్మేట్ లో రాజీనామా చేసి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తేల్చుకుందామన్నారు. అనిల్ ఆరోపణలపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. 2009లో అనిల్ కుమార్ 90 ఓట్లతో ఒడిపోయిపుడు నా కుటుంబ సభ్యులు ఏడ్చారు. ఇప్పుడు నా బిడ్డల గురించి మాట్లాడటం బాధేసిందన్నారు. అధికారాన్ని వదులుకుని ప్రతిపక్షం లోకి వచ్చానన్నారు.

నెల ముందు నుంచి నా పై అధిష్టానానికి అనుమానం పెరిగింది.నా మనసుకు కష్టం కలిగిందని కాబట్టే బయటకు వచ్చా..సజ్జల లాంటి వ్యక్తులు అడ్డ దిడ్డముగా ఆడియో వెనుక ఉన్నారు. థియేటర్ ల పరిస్థితి బాగలేక మూసుకుంటుంటే.. వారివద్ద నెల వారీ మామూళ్లు తీసుకుంటున్నానని ఆరోపించారు. ఇసుక ..మద్యం పేర్లతో ఎవరు వ్యాపారం చేస్తున్నారో ..వారి మీద ఆడియోలు పెట్టించండి. వీరి మీద ఆడియోలు పెడితే. మీ పదవి పోతుంది.ఇసుక మాఫియా ఎవరినీ ఖాతరు చేయడం లేదు. నన్ను అరెస్ట్ చేస్తామని సజ్జల ఆధ్వర్యంలో మీడియాకు లీకులు ఇస్తున్నారు. రండి..ఎప్పుడు వస్తారో రండి అని కోటంరెడ్డి సవాల్ విసిరారు.

Read Also: Marriage Cancel : కాసేపట్లో పెళ్లి.. కట్ చేస్తే సీనులోకి పోలీసులు.. ఈ పెళ్లి ఆపండి

జైళ్లు రాజకీయ నేతలకు అచ్చి వస్తాయి. సజ్జల కుమారుడు భార్గవ్ రెడ్డి సోషల్ మీడియాకు లీకులు ఇస్తున్నారు. ఆయన పార్టీకి ఏమి చేశారని ఆ పదవి ఇచ్చారు. ఎన్ని కేసులు పెట్టినా నా గొంతు ఆగదు.నన్ను ఎన్ కౌంటర్ చేస్తే తప్ప అన్నారు. రూరల్ వై.సి.పి.ఇంచార్జిగా నియమితులైన ఆదాల ప్రభాకర్ రెడ్డి కి శుభాభినందనలు అన్నారు కోటంరెడ్డి. తనకు అధికారం కొత్తకాదన్నారు. నమ్మక ద్రోహం అనే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. నిన్ను కార్పొరేటర్ ..ఎం.ఎల్.ఏ.టికెట్ ఇచ్చింది ఆనం వివేకా నంద రెడ్డి కాదా? అలాంటి ఆనం వాళ్ళ ఇంటి మీదకు వస్తా…అని హెచ్చరించావ్. నువ్వు ఎం.ఎల్.ఏ.గా ఓడిపోయినప్పటి నుంచి నిన్ను భుజాన వేసుకున్నానన్నారు.

డిసెంబర్ 25 న క్రిస్ట్ మస్ రోజున ఉదయం నుంచి సాయంత్రం వరకూ చర్చిలలో ఉన్నానన్నారు. తనపై అనిల్ చేసిన ఆరోపణలను కొట్టిపారేశారు. అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది ఫోన్‌ ట్యాపింగ్‌ కాదని.. అది రికార్డింగ్‌ మాత్రమేనని వైసీపీ నేతలు అంటున్నారు. అంతేకాదు, జగన్ నమ్మి పదవులు ఇస్తే కోటంరెడ్డి గతేడాది డిసెంబర్‌ 25న కోటంరెడ్డి బ్లూకలర్‌ బెంజ్‌ కారు వేసుకొని.. చంద్రబాబు ఇంటికి వచ్చి రెండు గంటల పాటు మాట్లాడి వెళ్లాడని టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చెబుతున్నారని పేర్ని నాని స్పష్టం చేశారు. నారాయణతో ఉన్న సంబంధాన్ని ఇప్పుడూ కంటిన్యూ చేయమని చంద్రబాబు చెప్పినట్టు టీడీపీకి చెందిన నేతలే చెబుతున్నారన్నారు. లోకేష్‌తోనూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రెగ్యులర్‌గా మాట్లాడుతున్నట్టుగా చెబుతున్నారని పేర్ని నాని వివరించారు.

Read Also: WRITER PADMABHUSHAN Review: రైటర్ పద్మభూషణ్ రివ్యూ

Exit mobile version