Site icon NTV Telugu

Kota Factory: ‘కోటా ఫ్యాక్టరీ’ సీజన్‌ 3 వచ్చేస్తోంది.. సిద్ధంగా ఉండండి!

Kota Factory Season 3

Kota Factory Season 3

Kota Factory Season 3 comes to Netflix on June 20: ఓటీటీలలో కొన్ని వెబ్‌ సిరీస్‌లకు సూపర్ క్రేజ్‌ ఉంటుంది. ఒక సీజన్‌ పూర్తయ్యాక.. మరో సీజన్‌ కోసం ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తుంటారు. అలాంటి వెబ్‌ సిరీస్‌లలో ‘కోటా ఫ్యాక్టరీ’ ఒకటి. ఈ సిరీస్ నుంచి రెండు సీజ‌న్‌లు విడుద‌ల కాగా.. భారీ హిట్ సాధించాయి. దాంతో సీజన్ 3 ఎప్పుడు వస్తుందా? అని ఫాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో నెట్‌ఫ్లిక్స్‌ శుభవార్త అందించింది. జూన్‌లో కోటా ఫ్యాక్టరీ సీజన్‌ 3 స్ట్రీమింగ్‌ అవుతుందని పేర్కొంది.

‘కోటా ఫ్యాక్టరీ’ సీజన్ 3 జూన్ 20 నుంచి స్ట్రీమింగ్ కానున్న‌ట్లు నెట్‌ఫ్లిక్స్‌ వెల్ల‌డించింది. సౌరభ్‌ కన్నా రూపొందించిన ఈ వెబ్‌ సిరీస్‌కు రాఘవ్‌ సుబ్బు దర్శకత్వం వహించారు. ఇందులో జితేంద్ర కుమార్ టీచ‌ర్‌గా న‌టించ‌గా.. వైభవ్‌ లీడ్ రోల్‌లో న‌టించాడు. అహ్సాస్ చన్నా, మయూర్ మోర్, రేవతి పిళ్లై త‌దిత‌రులు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఐఐటీలో సీటు కోసం కోటాలో వైభవ్‌ పడిన ఇబ్బందులను ఆధారంగా ఈ వెబ్ సిరీస్ వ‌చ్చింది.

Also Read: Vijay Sethupathi-Fan: అభిమాని ఇంట్లో స్టార్‌ హీరో సందడి.. వీడియో వైరల్!

దేశవ్యాప్తంగా ఉన్న విద్యార్థులు తమ ఉన్నత చదువుల కోచింగ్‌ కోసం రాజస్థాన్‌లోని కోటా ప్రాంతానికి వెళ్తుంటారు. ఐఐటీ కోచింగ్‌ కోసం ఎక్కువగా విద్యార్థులు అక్కడి వెళుతారు. సీటు సాధించే క్రమంలో వారు ఎక్కువగా ఒత్తిడికి గురవుతుంటారు. ఈ ఒత్తిడిని తట్టుకోలేక ఇప్పటికే చాలా మంది ఆత్మహత్య చేసుకున్నారు. కోటా విద్యార్థుల జీవితాల ఆధారంగా కోటా ఫ్యాక్టరీ వెబ్‌ సిరీస్‌ తెరకెక్కుతోంది. 2019లో మొదటి సీజన్‌ రాగా.. 2021లో రెండో సీజన్ వచ్చింది. 2024లో మూడో సీజన్ రాబోతోంది.

Exit mobile version