Kotabommali PS : కోట బొమ్మాళి పీఎస్ మూవీ ఓటీటీ పార్టనర్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ సీనియర్ హీరో శ్రీకాంత్ మేక ప్రధాన పాత్రలో నటించిన సినిమా ‘కోట బొమ్మాళి పీఎస్’. ఈ సినిమా లో విలక్షణ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ ప్రత్యేక పాత్ర పోషించారు.ఫైట్ మాస్టర్ విజయ్ కుమారుడు రాహుల్ విజయ్ హీరో గా నటించగా యాంగ్రీ స్టార్ రాజశేఖర్ పెద్ద కుమార్తె అయిన శివానీ రాజశేఖర్ హీరోయిన్ గా నటించింది..ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ పతాకంపై ‘బన్నీ’ వాస్ మరియు విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మించారు.. కోట బొమ్మాళి పీఎస్’ చిత్రాన్ని యువ దర్శకుడు తేజా మార్ని తెరకెక్కించారు. ఆయన దర్శకుడిగా పరిచయమైన ‘జోహార్’ సినిమా డైరెక్టుగా ఆహా ఓటీటీలో విడుదల అయ్యింది. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. తొలి సినిమా తర్వాత శ్రీ విష్ణు కథానాయకుడిగా ‘అర్జున ఫాల్గుణ’ అనే సినిమా తీశారు. ఇప్పుడు మూడో సినిమాగా మలయాళ హిట్ ‘నాయట్టు’ను ‘కోట బొమ్మాళి పీఎస్’గా ఈ దర్శకుడు రీమేక్ చేశారు. ఈ సినిమా నవంబర్ 24న థియేటర్లలో విడుదల అయ్యింది.’
కోట బొమ్మాళి పీఎస్ ‘ రీమేక్ సినిమా అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన యాస, భాషలను కథకు అద్ది మన నేటివిటీకి తగ్గట్లు సినిమాను మలచడంలో దర్శక నిర్మాతలు సక్సెస్ అయ్యారు. ఈ సినిమాకు తెలుగు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ లభిస్తోంది.’కోట బొమ్మాళి పీఎస్’ సినిమాలో హోమ్ మంత్రి పాత్రలో మురళీ శర్మ అద్భుతంగా నటించారు. ఆయన పాత్రకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇతర కీలక పాత్రల్లో బెనర్జీ, దయానంద్, సివిఎల్ నరసింహారావు మరియు ప్రవీణ్ తదితరులు నటించారు.ఇదిలా ఉంటే ‘కోట బొమ్మాళి పీఎస్’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను హండ్రెడ్ పర్సెంట్ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’ సొంతం చేసుకుంది. థియేటర్లలో తమ సినిమా డిజిటల్ పార్ట్నర్ ‘ఆహా’ అని చిత్ర బృందం పేర్కొంది.అయితే ‘ఆహా’ ఓటీటీలో ‘కోట బొమ్మాళి పీఎస్’ ఎప్పుడు స్ట్రీమింగ్ అవుతుంది..అనేది మాత్రం ఇంకా వెల్లడించలేదు.కానీ న్యూ ఇయర్ లేదా సంక్రాంతి పండగ సందర్భంగా ఈ సినిమా డిజిటల్ రిలీజ్ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది
Also Read
- PM Modi - Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
- Number Secrete: మొబైల్ నంబర్‌కు ముందు '+91' ఎందుకు ఉంటుందో తెలుసా..? ఆ రహస్యం ఇదే..
- PM Modi: ‘రూల్ టేకర్’ కాదు, ‘రూల్ షేపర్’గా మారాలి.. బ్రిక్స్ వేదికపై మోదీ పిలుపు
- SBI Loans: ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. UPI చెల్లింపుల ఆధారంగా కూడా రుణాలు మంజూరు..
తాజావార్తలు
-
PM Modi – Netanyahu: బ్రిక్స్ వేళ, ఇజ్రాయిల్ ప్రధానికి మోడీ శుభాకాంక్షలు..
-
Khairatabad Ganesh: ఖైరతాబాద్ గణేష్‌కు భారీ రద్దీ.. ట్రాఫిక్ పోలీసుల బిగ్ ప్లాన్
-
Amit Majithia: స్టార్ క్రికెటర్ల పరువు గంగపాలు? దుబాయ్ రహస్య విందుల్లో బయటపడ్డ దిమ్మతిరిగే నిజాలు!
-
Ponguleti Srinivas Reddy : 22Aపై రచ్చ.. BRSపై పొంగులేటి ఫైర్..!
-
Krithi Shetty: కోలీవుడ్‌లో బేబమ్మకు దక్కని హిట్.. రిలీజ్ ఎప్పుడో తేలని రూ.100 కోట్ల సినిమా!
ట్రెండింగ్
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!
-
BRICS Summit 2026: బ్రిక్స్ వేదికగా ఇరాన్‌తో భారత్ దౌత్యం.. చాబహార్‌తో కొత్త ట్రేడ్ రూట్.!