Site icon NTV Telugu

Korutla Murder Case: కోరుట్ల చిన్నారి హితిక్ష మర్డర్ కేసులో కొత్త కోణం…

Korutla Girl

Korutla Girl

కోరుట్ల చిన్నారి హితిక్ష మర్డర్ కేసులో కొత్త కోణం బయటపడింది. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రస్తుతం పిన్ని మమత పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. మమత ఒక్కతే హత్యకు పాల్పడిందా..? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నారు.

READ MORE: Donald Trump: పుతిన్ ప్రజల్ని చంపుతూ ఉండాలనుకుంటున్నాడు..

అసలు ఏం జరిగిందంటే..?
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలో హృదయాన్ని కలిచివేసే సంఘటన చోటుచేసుకుంది. ఐదేళ్ల పసిపాప హితిక్షను గుర్తు తెలియని దుండగులు గొంతు కోసి హత్య చేశారు. ఆడుకుంటూ బయటకు వెళ్లిన చిన్నారి కొద్ది గంటల్లోనే అదే కాలనీలోని ఓ ఇంటి బాత్రూంలో రక్తపు మడుగులో పడి మృతదేహంగా కనిపించడంతో కలకలం రేగింది. ఆదర్శనగర్‌లో నివాసముండే ఆకుల రాములు, నవీన దంపతులకు వేదాస్‌, హితిక్ష అనే ఇద్దరు సంతానం ఉన్నారు. ఉపాధి కోసం రాములు గల్ఫ్ వెళ్లగా, నవీన అత్తామామల వద్ద ఉంటోంది. శనివారం సాయంత్రం కాలనీలోని ఇతర పిల్లలతో ఆడుకుంటున్న హితిక్ష ఆ తరువాత కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు లోనయ్యారు. ఆమె ఆచూకీ లేకపోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. తద్వారా పోలీసులు స్థానికులతో కలిసి గాలింపు చేపట్టగా, అదే కాలనీలోని కొడుపల్లి విజయ్‌ ఇంటి బాత్రూంలో చిన్నారి రక్తపు మడుగులో పడి ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

READ MORE: Minister Janardhan Reddy: రాజకీయ లబ్ధి కోసమే తెలంగాణ ప్రభుత్వం, స్థానిక పార్టీల నాటకాలు..

Exit mobile version