జగిత్యాల జిల్లా కోరుట్లలో చిన్నారి హితిక్ష మర్డర్ సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమయ్యయి. ఈ నేపథ్యంలో రంగంలోకి దిగిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టగా చిన్నారి పిన్ని క్రూరత్వం బయటపడింది. బాలిక పిన్ని మమతను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు పోలీసులు. న్యాయమూర్తి.. మమతకు రిమాండ్ విధించారు.. దీంతో మమతను పోలీసులు జైలుకు తరలించారు. పక్కింటిలో బాలిక హితిక్షను హత్య చేసి పిన్ని మమత ఏమీ తెలియనట్లు…
కోరుట్ల చిన్నారి హితిక్ష మర్డర్ కేసులో కొత్త కోణం బయటపడింది. హితిక్షను కుటుంబసభ్యురాలే హత్య చేసినట్టు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.. ప్రస్తుతం పిన్ని మమత పోలీసుల అదుపులో ఉంది. పోలీసులు తమదైన శైలిలో విచారిస్తున్నారు. మమత ఒక్కతే హత్యకు పాల్పడిందా..? ఎవరైనా సహకరించారా? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు దారితీసిన కారణాలను ఆరా తీస్తున్నారు.