Kunamneni Sambashiva Rao: కాంగ్రెస్ ని ఎంపీ సీట్లు అడుగుతున్నామని, పోటీ చేయాలని అడుగుతున్న సీట్ల వివరాలు కాంగ్రెస్ కి ఇచ్చామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనమనేని సాంబశివరావు అన్నారు. నిన్న చరిత్రలో బ్లాక్ డే అని, కేజ్రీవాల్ అరెస్ట్ అన్యాయమన్నారు. కుట్ర పూరితంగా మోడీ వ్యవహారం చేస్తున్నారనీ మండిపడ్డారు. ఆయనలో హిట్లర్.. ఉన్నాడని కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ ఓ శాడిస్ట్.. నియంత అంటూ మండిపడ్డారు. ఘోరీ, ఔరంగజేబు లాంటి వాళ్ళను చూశాం.. ఇప్పుడు మోడీ వ్యవహారం అలాగే ఉందన్నారు. బాండ్ ల రూపంలో వేల కోట్లు బీజేపీ కొట్టేసిందన్నారు. అది అన్యాయం కాదా? అని ప్రశ్నించారు. నువ్వైతే వసూలు చేయొచ్చు.. మిగిలిన పార్టీల మీద అయితే అరెస్టులు చేస్తారా? మండిపడ్డారు. మీకొక న్యాయం.. ఇతర పార్టీలకు ఇంకో న్యాయమా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కవిత.. కేజ్రీవాల్ ని డిప్యూటీ సీఎంని అరెస్ట్ చేసినప్పుడు ఎందుకు చేయలేదు? అని ప్రశ్నించారు.
Read also: Arvind Kejriwal: కేజ్రీవాల్ జైలు నుంచి ప్రభుత్వాన్ని నడపటం కష్టం.. కానీ, ఒక మార్గం ఉంది..!
కేజ్రీవాల్ లొంగిపోతాడని వేధించారన్నారు. ఇండియా కూటమి నుండి బయటకు రాకపోవడంతో అరెస్ట్ చేశారని ఆరోపించారు. బాండ్ ల రూపంలో వచ్చిన డబ్బంతా అక్రమమే కదా? అని కీలక వ్యాఖ్యలు చేశారు. వాటిపైనా ఎందుకు చర్యలు లేవు? అని ప్రశ్నించారు. బందిపోట్ల నుండి బీజేపీ దొంగలు దోచుకున్నట్టు బాండ్ల రూపంలో దోచుకున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ని, బీజేపీ ని సమర్థవంతంగా ఎదుర్కోలేక పోతుందన్నారు. కలిసి వచ్చే వారిని కూడా కలుపుకుని పోవడం లేదన్నారు. కాంగ్రెస్ నిలబడాలి.. బీఆర్ఎస్ పని అయిపోయిందన్నారు. బీఆర్ఎస్ కూడా ఉండాలని తెలిపారు. బీజేపీ రాక్షస పార్టీలుగా మారిందన్నారు. కాంగ్రెస్ ఫ్రెండ్లి పార్టీలను కలుపుకుని పోవాలన్నారు. సీఎంలు హేమంత్ సొరేన్.. కేజ్రీవాల్ లను అరెస్ట్ చేశారని అన్నారు. 400 సీట్లు దాటాయి అంటే.. తెలంగాణలో కాంగ్రెస్ ని బతకనియ్యరు అన్నారు. బీజేపీ అనేది తీరని ప్రమాదమన్నారు.
Viral Video: ఏంటి భయ్యా ఇప్పుడు ఏసీలను ఇలా కూడా వాడేస్తున్నారా..?