రాజకీయ నాయకుడికిగా అన్ని పార్టీలకు చెందిన నాయకులు, అన్ని వర్గాల నాయకులకు ఆదరాభిమానాలు చూరగొన్న గొప్ప నేత కొణిజేటి రోశయ్య. నిలువెత్తు రూపం, వాక్పటిమ, రాజకీయ చతురత ఆయన సొంతం. ఎటువంటి అంశాన్నైనా తిప్పి కొట్టగలగడం, సరైన పంథాలో థీటుగా సమాధానం ఇవ్వడం ఆయన ప్రత్యేకత. అయితే.. గుంటూరు జిల్లా తెనాలి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఘనంగా మాజీ ముఖ్యమంత్రి కొణిజేటి రోశయ్య జయంతి వేడుకలు నిర్వహించారు. రోశయ్య జయంతి సందర్భంగా రోశయ్య చిత్రపటానికి మాజీ రాజ్యసభ సభ్యులు కేవీపీ రామచంద్రరావు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
Also Read : iPhone 15 Launch 2023: సెప్టెంబర్ 5న ఐఫోన్ 15 లాంచ్.. అదనంగా 5 ఫీచర్లు! యాపిల్ లవర్స్‌కు పండగే
ఈ సందర్భంగా కేవీపీ రామచంద్రరావు మాట్లాడుతూ.. శ్రమపడే తత్వం, ఆర్థిక క్రమశిక్షణ, పట్టుదలతో పని చేయటం రోశయ్య వ్యక్తిత్వమని ఆయన కొనియాడారు. మన వల్ల భావితరాలకు అప్పుల భారం పడకూడదని ఆలోచించే వ్యక్తి రోశయ్య అని, ఆర్థిక పరంగా గొప్ప ఎకనామిస్ట్ అయిన మన్మోహన్ సింగ్ ని ఒప్పించినా రోశయ్య నీ మాత్రం ఒప్పించలేకపోయే వాళ్ళమన్నారు. ప్రజల డబ్బులకు మనం ధర్మ కర్తలం మాత్రమేనని, ఆర్థిక క్రమశిక్షణ తప్పితే రాబోయే రోజుల్లో ప్రజలపై భారం పడుతుందని రోశయ్య చెప్పేవాళ్ళన్నారు. రోశయ్య ప్రజా ధనానికి ట్రస్టీగా మాత్రమే ఉండేవాళ్ళు అని, రాష్ట్ర ఆర్థిక శక్తి పటిష్టంగా ఉంది అంటే అది రోశయ్య వేసిన పునాదులు కారణమే అని ఆయన వ్యాఖ్యానించారు. రోశయ్య కాంగ్రెస్ పార్టీకి చేసిన సేవలు అమూల్యమైనవని ఆయన గుర్తు చేసుకున్నారు.
Also Read : Parents Rent: అద్దెకు అమ్మానాన్నలు.. భలే బిజినెస్ బాసూ