NTV Telugu Site icon

Minister Kondapalli Srinivas: బాధ్యతలు స్వీకరించిన మంత్రి శ్రీనివాస్‌.. చిన్న పరిశ్రమలకు రాయితీలు

Kondapalli Srinivas

Kondapalli Srinivas

Minister Kondapalli Srinivas: చిన్న పరిశ్రమలకు రాయితీలు అందిస్తామని ప్రకటించారు రాష్ట్ర చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.. ఈ రోజు సచివాలయంలో మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో మంత్రిగా బాధ్యతలు తీసుకున్నాను అన్నారు.. ఏంఎస్ఏంఈ, సెర్ఫ్, ఎన్నారై విభాగం ఈ మూడు విభాగాలు అనుసంధానం చేసి ఒక ప్రత్యేక శాఖ ఏర్పాటు చేశారన్నారు.. చిన్న పరిశ్రమల ద్వారా ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉన్నాయని వెల్లడించారు. నూతన పారిశ్రామిక వేత్తలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తాం… స్కిల్ డెవలప్మెంట్ కోసం ప్రత్యేక దృష్టి పెట్టాల్సి ఉందన్నారు.. గత ప్రభుత్వం లో చిన్న పరిశ్రమల కు ఎదురైనా సమస్యలు పరిష్కరిస్తాం.. రాయితీలు అందజేస్తామని పేర్కొన్నారు చిన్న తరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌.

Read Also: East Godavari District : మైనర్ బాలికపై అత్యాచారం కేసు – 20 ఏళ్ల జైలు శిక్ష విధించిన పోక్సో కోర్టు