Konda Surekha: కొండా సురేఖకు మంత్రి పదవి నుంచి ఉద్వాసన.. కీలక పదవుల్లో కొత్త నియామకాలు.!

  • తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు..
  • మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని నిర్ణయం..
  • కొండా సురేఖను తొలగించేందుకు గవర్నర్‌కు సిఫార్సు..
  • తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని రద్దు
  • చిన్నారెడ్డి స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా
  • తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నీరెల్లా శారద
  • కాకతీయ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధా రాణి..
Konda Surekha (1)

Konda Surekha (1)

Konda Surekha: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తొలగించాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించినట్లు సమాచారం. ఈ మేరకు గవర్నర్‌కు సిఫార్సు కూడా పంపినట్లు తెలుస్తోంది.. మరోవైపు తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా ఉన్న డాక్టర్ జి. చిన్నారెడ్డి నియామకాన్ని తక్షణమే రద్దు చేయాలని నిర్ణయించారు. ఆయన స్థానంలో గద్వాల్ విజయలక్ష్మిని తెలంగాణ ప్రణాళికా బోర్డు వైస్ చైర్మన్‌గా నియమించినట్లు వెల్లడించారు.

మరోవైపు హైదరాబాద్‌లోని తెలంగాణ రాష్ట్ర మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా నేరెళ్ల శారదను నియమించేందుకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. మహిళా కమిషన్‌లో ఈ నియామకం త్వరలోనే అధికారికంగా అమల్లోకి రానుంది. ఇక కాకతీయ పట్టణ అభివృద్ధి ప్రాధికార సంస్థ (కుడా) ఛైర్‌పర్సన్‌గా మాజీ రాజ్యసభ ఎంపీ జి. సుధా రాణిని నియమించేందుకు కూడా ఆమోదం తెలిపినట్లు సమాచారం. దీంతో తెలంగాణలో మంత్రివర్గంతో పాటు పలు కీలక నామినేటెడ్ పదవుల్లో మార్పులు చోటుచేసుకున్నాయి.

ఈ నిర్ణయాలతో రాష్ట్ర రాజకీయాల్లో మరిన్ని మార్పులు ఉండొచ్చనే చర్చకు తెరలేచింది. అయితే నియామకాలు, తొలగింపులకు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు వెలువడిన తర్వాత పూర్తి వివరాలు స్పష్టమయ్యే అవకాశం ఉంది.