Konda Surekha: కాంగ్రెస్ హైకమాండ్ కీలక నిర్ణయం.. మంత్రి కొండా సురేఖ బర్తరఫ్కు రంగం సిద్ధం?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Konda Surekha Facing Cabinet Exit: తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మంత్రి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించే అంశంపై కాంగ్రెస్ అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీలో మంగళ, బుధ వారాల్లో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ముఖ్య నేతలు అధిష్ఠానంతో నిర్వహించిన చర్చల అనంతరం ఈ పరిణామాలు చోటుచేసుకున్నట్లు సమాచారం.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన వెంటనే కొండా సురేఖ బర్తరఫ్కు సంబంధించిన లేఖను లోక్‌భవన్‌కు పంపించే అవకాశం ఉందని సమాచారం. బర్తరఫ్ అనంతరం రాష్ట్ర రాజకీయాల్లో చోటుచేసుకునే పరిణామాలపై కూడా కాంగ్రెస్ అధిష్ఠానం, రాష్ట్ర నాయకత్వం దృష్టి సారించినట్లు తెలుస్తోంది. కొండా సురేఖ, చిన్నారెడ్డి వ్యవహారాలకు సంబంధించి సీఎం రేవంత్, పీసీసీ అధ్యక్షుడు ముఖేష్ కుమార్ గౌడ్, రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్‌ఛార్జి మీనాక్షి నటరాజన్ సహా పలువురు సీనియర్ నేతల నుంచి అధిష్ఠానం ఇప్పటికే అభిప్రాయాలను సేకరించింది. ఈ నేపథ్యంలోనే మంత్రి సురేఖ విషయంలో తుది నిర్ణయం తీసుకుంది.
Also Read
- IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
- AP, Telangana Holiday Today: ఏపీ, తెలంగాణలో నేడు సెలవు.. ఈ జిల్లాల్లో అన్నీ బంద్..
- Ganesh Immersion: హైదరాబాద్ గణేష్ నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు.. MJ మార్కెట్ నుంచి ఖైరతాబాద్ వరకు పటిష్ట బందోబస్తు.!
- Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
కొండా సురేఖను మంత్రివర్గం నుంచి తప్పిస్తే ఏర్పడే రాజకీయ సమీకరణాలను కూడా కాంగ్రెస్ నాయకత్వం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ముగ్గురు బీసీ మహిళా నేతలకు కీలక పదవులు కేటాయించే అంశంపై చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ప్లానింగ్ కమిషన్ వైస్ చైర్మన్ పదవిని బీసీ మహిళా నేతకు ఇవ్వడంతో పాటు.. మరో రెండు కీలక పదవులను కూడా బీసీ మహిళా నేతలకు కేటాయించే అంశాన్ని పార్టీ పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పేర్లను పార్టీ సీనియర్ నేతల నుంచి కాంగ్రెస్ హైకమాండ్ సేకరిస్తున్నట్లు సమాచారం.
తెలంగాణలో సామాజిక సమీకరణాలను దృష్టిలో పెట్టుకుని ఈ నియామకాలు చేపట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. అయితే ఎవరిని ఎంపిక చేయాలనే విషయంలో ఇంకా తుది నిర్ణయం వెలువడాల్సి ఉంది. సీఎం రేవంత్ రెడ్డి మధ్యాహ్నం ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. ఆయన హైదరాబాద్ చేరుకున్న తర్వాత కొండా సురేఖ బర్తరఫ్కు సంబంధించిన తదుపరి చర్యలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌లో చోటుచేసుకుంటున్న ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.
తాజావార్తలు
-
IND vs WI: రోహిత్ శర్మ ముందు అరుదైన రికార్డులు.. సెంచరీ చేస్తే సచిన్ సరసన.!
-
EC: ఎన్నికల సంఘాన్ని ఏలుతున్నదెవరు?
-
Protein Beer: మందుబాబులు, మందుపాపలు తప్పక తెలుసుకోవాల్సిన మ్యాటర్..!ప్రోటీన్ బీర్ మంచిదేనా?
-
Renault Rafale Hypnotic: రెనాల్ట్ రఫేల్ హిప్నోటిక్ లాంచ్.. 300hp పవర్, 1,000KM రేంజ్‌తో అదిరిపోయే SUV
-
Explainer: విధ్వంసం..వినాశనం..విషాదం.. వైభవం విలయం!
ట్రెండింగ్
-
Amazon నుంచి Meesho వరకు.. YouTube Shoppingలోకి కొత్త ఈ-కామర్స్ ప్లాట్‌ఫామ్స్!
-
itel ACE 4 Shine: రూ.1,059కే కొత్త ఫీచర్ ఫోన్.. టైప్-C ఛార్జింగ్‌తో పాటు అదిరిపోయే ఫీచర్లు.!
-
LIC Smart Pension Plan: రిటైర్మెంట్ తర్వాత ఆర్థిక భద్రత ఇచ్చే బెస్ట్ స్కీమ్.. జీవితాంతం నెలకు రూ. 25,000 పెన్షన్..!
-
Wall Weeds: గోడలు మొలిచే పిచ్చి మొక్కలతో భవనాలకే ముప్పు.. సింపుల్ చిట్కాలు ఇవే..!
-
Asian Games 2026లో భారత్ షెడ్యూల్ ఇదే.. పాకిస్థాన్‌తో మ్యాచ్ ఎప్పుడంటే?