Site icon NTV Telugu

Konda Surekha : బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీ

Konda Surekha

Konda Surekha

సీఎం కేసీఆర్,ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకురాలు కొండా సురేఖ నిప్పులు చెరిగారు. తాజాగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పార్టీ అంటే భారత రాబడి పార్టీ అని ఆమె అభివర్ణించారు. భారతదేశాన్ని దోచుకోవడం కోసమే బీఆర్ఎస్ పార్టీ పెట్టారని ఆమె ఆరోపించారు. కేసీఆర్ సీఎం అయినా తరువాత మేధావులు మాట్లడటం మానేశారని, మేధావుల సూచనతో కేసీఆర్‌కు సంబంధం లేని, ఆయన అనుకున్నది చేస్తాడంటూ ఆయన విమర్శించారు. జాగృతి పేరుతో ఎమ్మెల్సీ కవిత కోట్లాది రూపాయలు వసూలు చేశారని, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకీ వచ్చాక జాగృతిని కవిత పట్టించుకోలేదని ఆమె వ్యాఖ్యానించారు. ఇప్పుడు సీబీఐ కేసులు రాగానే మళ్ళీ జాగృతిని ముందుకు తెస్తున్నారని, సీబీఐ కేసు అరెస్టుకు దారితీస్తుందని భయంతో జాగృతిని రంగంలోకి దింపిందని ఆమె మండిపడ్డారు. జాగృతిని అడ్డుపెట్టుకుని సీబీఐ నుండి తప్పించుకోవాలని కవిత చూస్తుందని ఆమె అన్నారు.
Also Read : Damodar Raja Narasimha : కాంగ్రెస్‌కు కోవర్ట్‌ రోగం పట్టింది

ఇదిలా ఉంటే.. ఇటీవల పీసీసీ కమిటీల ప్రకటించగా.. తనకు సముచిత న్యాయం జరుగలేదని కొండా సురేఖ ఆమె స్థానానికి రాజీనామా చేశారు. దీంతో.. ఆమె కాంగ్రెస్‌ పార్టీ వీడనున్నట్లు వార్తలు రావడంతో దానిపై స్పందించారు. తాను పార్టీకి రాజీనామా చేస్తున్నానన్న వార్తలు అవాస్తవమని కొండా సురేఖ స్పష్టం చేశారు.. పార్టీ మారే ఆలోచన లేదు.. ఆ అవసరం లేదన్నారు కొండా సురేఖ. పార్టీ ఇచ్చిన ఎగ్జిక్యూటివ్ కమిటీ పోస్ట్ కు రాజీనామా చేశానని, సీనియర్ నేతగా గౌరవం తగ్గించినట్లుగా ఉందన్నారు కొండా సురేఖ. పదవులు ముఖ్యం కాదని, గతంలో మంత్రి పదవికి రాజీనామా చేశానని గుర్తు చేశారు కొండా సురేఖ. ఈ అంశాన్ని ఇష్యూ చేయొద్దని, ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాన‌ని ఆమె వెల్లడించారు.

Exit mobile version