Site icon NTV Telugu

Minister Konda Surekha: సీఎం రేవంత్ రెడ్డికి క్షమాపణలు చెప్పిన కొండా సురేఖ..

Konda

Konda

Minister Konda Surekha Apologizes to CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి మంత్రి కొండా సురేఖ క్షమాపణలు చెప్పారు. గురువారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలోని అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. సుమారు గంటన్నర సేపు రాజకీయాంశాలు, మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు తెలిసింది.

READ MORE: Team India: సెంచరీలతో చెలరేగిన స్మృతి, ప్రతీక.. సెమీస్‌ బెర్తు ఖరారు!

సమావేశం అనంతరం మీడియా సమావేశంలో కొండా సురేఖ మాట్లాడారు. ఇటీవల జరిగిన తన శాఖ ఓఎస్డీ సుమంత్‌ వ్యవహారం, తన కూతురు చేసిన ఆరోపణలపై ఆమె తాజాగా ఆమె స్పందించారు. తమ ఇంటికి పోలీసులు రావడంతోనే తన కూతురు ఆవేశంతో మాట్లాడిందన్నారు. తన కూతురు మాటలకు ముఖ్యమంత్రికి క్షమాపణలు చెప్పారు. తమ మధ్య విభేదాలు లేవన్నారు. అన్ని సమిసిపోయాయని.. అన్ని పార్టీల్లో వచ్చినట్టే తమ పార్టీలో కూడా ఏదో అపార్థం చేసుకున్నాం. దాంతో కొన్ని గొడవలు రావడం జరిగిందన్నారు. కుటుంబం అన్నాక అందరం కలిసి నడవాల్సిందే.. మా కుమార్తె ఆ రోజు పోలీసు రావడం వల్ల ఆవేశంలో ముఖ్యమంత్రిపై అలా మాట్లాడింది.. ఈ విషయంలో నేను క్షమాపణ చెప్తున్నాను.. అందరం సర్దుకొని ముందుకు వెళ్తామని తెలియజేస్తున్నానన్నారు..

READ MORE: Bus Fire Accident: డ్రైవర్ నిర్లక్ష్యం.. బస్సు ప్రమాదంపై ప్రయాణికుడి కీలక వ్యాఖ్యలు..

 

Exit mobile version