Fire Accident: డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో భారీ అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. రాయవరంలోని గణపతి గ్రాండ్ బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. మంటల్లో చిక్కుకుని ఆరుగురు సజీవ దహనమయ్యారు. మరికొందరికి గాయాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన ఇద్దరిని అనపర్తి ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. మిగిలిన వారిని ప్రైవేటు ఆస్పత్రులకు తరలించారు. ఈ ఘటనపై తాజాగా సీఎం చంద్రబాబు స్పందించారు. ఈ మేరకు సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఎక్స్‌లో ట్వీట్ చేశారు.
READ MORE: Myanmar: మయన్మార్ బౌద్ధ ఉత్సవంపై బాంబు దాడి.. 24 మంది మృతి
“అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరంలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాద ఘటన కలిచివేసింది. ఈ ఘోర ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర ఆవేదన కలిగించింది. ప్రమాద కారణాలు, ప్రస్తుత పరిస్థితి, సహాయక చర్యలు, వైద్య సాయంపై అధికారులతో మాట్లాడాను. స్వయంగా సంఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొనాలని ఉన్నతాధికారులను ఆదేశించాను. క్షతగాత్రులకు మెరుగైన వైద్య సాయం అందించాలని సూచించాను. బాధిత కుటుంబాలను ఆదుకుంటాం.” అని సీఎం చంద్రబాబు ట్వీట్‌లో పేర్కొన్నారు.
READ MORE: iPhone 15: కొంటే ఐఫోన్ నే కొనాలనుకుంటున్నారా?.. అయితే ఐఫోన్ 15 పై ఈ డీల్ మిస్ చేసుకోకండి