Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy : కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

కేటీఆర్ పచ్చి అబద్దాల మాట్లాడుతున్నారని కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఫైర్‌ అయ్యారు. కేటీఆర్‌ లేని పోని ..నిరాధార ఆరోపణలు చేస్తున్నారని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతిపక్షం ఉందా.. ప్రతిపక్ష నాయకుడు ఉన్నాడా అనేది కూడా తెలియకుండా పోయిందన్నారు. పచ్చకామెర్లు వాడికి ప్రపంచం అంతా పచ్చగా కనిపించినట్టు ఉంది కేటీఆర్ పరిస్థితి ఉందన్నారు. మీలాగా మేము ఉండమని, మేము అధికారం లోకి వచ్చి 8 నెలలు.. 8 వేల కోట్లు ఎక్కడ వచ్చాయో చెప్పాలన్నారు. కాళేశ్వరం కూలిపోయింది.దాంట్లో జైలుకు వెళ్లడం ఖాయమని, అమెరికా వెళ్లి ప్రభాకర్ రావు నీ తెలంగాణ కి రావద్దు అని చెప్పి వచ్చిండు అని, కేటీఆర్… ఆధారాలు ఉంటే.. దమ్ముంటే నిరూపించు అని ఆయన అన్నారు. దోచుకు తిన్నది మీరు అని, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు మీ హయంలో అని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. పదేళ్లు రాష్ట్రాన్ని దోచుకున్నారు కేటీఆర్.. మిషన్ భగీరథ..కాళేశ్వరం పేరుతో లక్షల కోట్లు దోచుకున్నారన్నారు.

Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య

అంతేకాకుండా..’కేటీఆర్.. 8888 కోట్లు వచ్చినట్టు ఆధారాలు ఉంటే బయట పెట్టు. మా ప్రభుత్వం ఏర్పాటు కాక ముందే టెండర్లు పిలిచారు. సత్యం రామలింగ రాజు కుమారుడు కేటీఆర్ బినామీ గా పెట్టీ 3300 కోట్ల పనులు ఇచ్చావు. అన్నీ తెలిసి చిన్న పిల్లాడిగా మాట్లాడుతున్నారు. ఆధారాలు లేకుండా మాట్లాడు..దేనికైనా సిద్ధం. కేటీఆర్…హరీష్ మధ్య ప్రతిపక్ష నేత పదవి కోసం పంచాయతీ నడుస్తుంది. కేసీఆర్… నిన్ను వద్దని చెప్తున్నాడు. ఆ ప్రస్టేషన్ లో మాట్లాడుతున్నాడు కేటీఆర్. నీ పార్టీ ఉంటాదో లేదో తెలియదు. మీ అయ్యని బయటకు రమ్మను. నిన్ను..నీ బావ నీ ప్రజలు నమ్మరు’ అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.

Golden Temple: ఆలయం కాంప్లెక్స్‌లో కాల్పుల కలకలం.. యువకుడు ఆత్మహత్య

Exit mobile version