NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy: రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడం..

Komatireddy

Komatireddy

ఢిల్లీలో కాంగ్రెస్ ఎంపీ పదవికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి రాజీనామా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నన్ను ఎంపీగా ఎన్నుకున్న ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. మీరు నన్ను ఎంపీగా ఎన్నుకుని నాకు పునర్జన్మ ఇచ్చారు.. ఎప్పటికీ భువనగిరి ప్రజలకు రుణపడి ఉంటాను అని వెంకట్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో కొత్త తెలంగాణ భవన్ నిర్మించాలని నిర్ణయం తీసుకున్నాం.. మార్చిలో భవన్ శంకుస్థాపన చేస్తాం.. ఏడాదిలోనే నిర్మాణం పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. రేపు భవన్ అధికారులతో రివ్యూ నిర్వహిస్తాను.. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు మేము పాల్పడం అని తెలిపారు. గత ప్రభుత్వ మంచి, చెడులపై క్యాబినెట్ లో చర్చ చేస్తాం.. ఒక్క ఉపాధ్యాయ నియామకం చేపట్టలేదు.. గత ప్రభుత్వం ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు.. 6 వేల పాఠశాలలు మూతబడ్డాయి అని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు.

Read Also: BSF: స్మగ్లర్లు LOC వెంబడి డ్రోన్‌లను ఉపయోగిస్తున్నారు

భువనగిరి ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. ఎంపీగా గెలిపించి నాకు పునర్జన్మ ఇచ్చారు.. భువనగిరి ఎంపీగా లేకపోయినా నియోజకవర్గ ప్రజలందరికీ ఎప్పుడు అందుబాటులో ఉంటాను.. ఇంటికో వెయ్యి వేసుకోని ప్రజలే నన్ను గెలిపించారు.. గత రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని కలవలేదు, నిధులు ఇవ్వలేదు.. కేంద్ర మంత్రి నితిన్ గట్కరిని కలిసి జాతీయ రహదారుల అభివృద్ధికి సహకరించాలని విజ్ఞప్తి చేశాను.. కేంద్రమంత్రి సానుకూలంగా స్పందించారు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వెల్లడించారు.