Site icon NTV Telugu

Komatireddy Venkat Reddy: సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం మానేశా.. పెరిగిన ధరలకు నాకు సంబంధం లేదు..!

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy: చాలా రోజుల తర్వాత హీరో ప్రభాస్ ను వెండితెరపై చూడడానికి అభిమానులు ఎగబడ్డారు. ఇది ఇలా ఉండగా.. సినిమా టికెట్ ధరలకు సంబంధించి అనేక విషయాలు ఇప్పుడు తెగ హాట్ టాపిక్ గా మారాయి. ఆంధ్రప్రదేశ్ లో ఎటువంటి ఇబ్బందులు ఎదురు కాకపోయినా.. తెలంగాణలో మాత్రం సినిమా ధరలతో సంబంధించి గవర్నమెంట్ ఆర్డర్ రావడం కాస్త ఆలస్యం అయ్యింది. అయితే అన్ని అడ్డంకులు ఎదుర్కొని చివరకు శుక్రవారం తెల్లవారుజామున 12 తర్వాత ప్రీమియర్ షోలు పడ్డాయి. ఇది ఇలా ఉండగా..

The Raja Saab: ప్రభాస్ బాక్సాఫీస్ ప్రభంజనం: ‘ది రాజా సాబ్’ సరికొత్త రికార్డు!

ప్రభాస్ నటించిన “ది రాజాసాబ్” సినిమా టికెట్ల ధరల పెంపునకు అనుమతినిస్తూ ప్రభుత్వం జారీ చేసిన ఆర్డర్ ను శుక్రవారం తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. నిబంధనలకు విరుద్ధంగా ఈ అనుమతులు ఇచ్చారని న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన కోర్టు, ప్రభుత్వ తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది.

అలాగే మీరు తెలివిగా మెమోలు ఎందుకు ఇస్తున్నారని ప్రభుత్వ న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది. మంత్రులు స్వయంగా ధరలు పెంచమని చెబుతుంటే, వెనుక నుంచి ఇలాంటి మెమోలు ఎలా వస్తున్నాయని మండిపడింది. ఈ గందరగోళం మధ్య సినిమా ఇండస్ట్రీ వ్యవహారాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. టికెట్ల ధరల పెంపుతో తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన తేల్చి చెప్పారు.

రూ.13 వేలకే 10,000mAh బ్యాటరీ, 6.81 అంగుళాల 1.5K డిస్‌ప్లే.. Honor X80 స్పెక్స్ ఇవే!

పుష్ప-2 సినిమా తర్వాత నా దగ్గరికి టికెట్ రేట్లు పెంచాలని ఎవ్వరూ రావద్దని ముందే చెప్పాను. అలాగే అఖండ 2 సమయంలో కూడా ఇలాగే జరిగింది. అయితే ఇప్పుడు నన్ను ఎవరూ కలవడం లేదు. పెరిగిన ధరలకు, నాకు ఎటువంటి సంబంధం లేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇంకా పుష్ప-2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందడంపై మంత్రి తీవ్రంగా స్పందించారు. ఆ ఘటనకు పర్మిషన్ ఇచ్చినందుకు తాను చాలా బాధపడ్డానని, ఇంకా గాయపడిన వారి బాబు ట్రీట్‌మెంట్ కోసం తన సొంత డబ్బులు కూడా ఇచ్చానని, ఆ చేదు అనుభవం వల్లే ఇకపై సినిమా ఇండస్ట్రీ గోలకు వెళ్లకూడదని నిర్ణయించుకున్నట్లు మంత్రి అన్నారు.

Exit mobile version