NTV Telugu Site icon

Komatireddy Venkat Reddy : ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాంకు తెరలేపారు

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

మేము అధికారంలోకీ రాగానే ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. మహబుబ్ నగర్ జిల్లాలోని జడ్చర్ల ప్రేమ్ రంగారెడ్డి గార్డెన్ లో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఇవాళ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 0 బిల్లులతో ప్రతి పేదవాడి కరెంట్ బిల్లుల లేకుండా చేస్తున్నామన్నారు. భధ్రాచలం రాములవారి సన్నిధి నుండే ప్రతి పేదవాడికి 5లక్షలతో డబుల్ బెడ్ ఇల్లు కేటాయించే కార్యక్రమాన్ని చేపడుతామని ఆయన పేర్కొన్నారు. మేము నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తే ఈరోజు బీఆర్ఎస్ దానిని రాజకీయం చేస్తుందని ఆయన ధ్వజమెత్తారు. నిరుద్యోగులకు స్కిల్ డెవలప్ మెంట్ సెంట్రల్ ఏర్పాటు కోసం ముఖ్యమంత్రి మంచి విజన్ తో ముందుకు వెళుతున్నారని, పదేళ్ల కాలంలో కేసీఆర్ నిరుద్యోగులన గురించి ఎప్పడూ మాట్లాడలేదన్నారు మంత్రి కోమటిరెడ్డి. డీఎస్సీ ద్వారా నిరుద్యోగులకు మంచి చేయాలని చూస్తుంటే దానిని కేసీఆర్‌ తప్పు దారి పట్టిస్తున్నాడన్నారు.

అంతేకాకుండా..’పాలమూరు, కొడంగల్ ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలోనే వాటిని పూర్తి చేస్తాం… కరీంనగర్ లో ఓడిపోతానని తెలిసి మహబుబ్ నగర్ నీటిని కరీంనగర్ కు తరలించావు…. నీకు రాజకీయ భిక్ష పెట్టిన పాలమూరుకు తీరని అన్యాయం చేసావు… బీఆర్ఎస్ ప్రభుత్వంలో తెలంగాణ రాష్ట్రాన్ని భారీ అప్పుల ఊబిలో నెట్టివేసింది…. ఈరోజు ప్రభుత్వ ఉద్యోగులకు మొదటి తారీఖున జీతాలు వేస్తున్నాం…. మహబుబ్ నగర్ జిల్లా ప్రజలను మోసం చేసి పక్క రాష్ట్రాలకు పంపి వారిని లేబర్ గా మార్చావు… నీవు మహబుబ్ నగర్ జిల్లాలో కట్టిన ఒక్క ప్రాజెక్టు పాలమూరుకు ఉపయోగపడలేదు.. ప్రాజెక్టుల పేరిట కోట్ల రూపాయల స్కాం కు తెరలేపావు…. హరీష్ రావు, కేటీఆర్ లు ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడటం హాస్యాస్పదం…. రాబోయే రోజుల్లో మహబూబ్ నగర్ కు మంచి రోజులు తెస్తాం… జిల్లాలో RRR రోడ్డు చేపట్టి గ్రీన్ ఫీల్డ్ హైవే ద్వారా రహదారులను మరింత అభివృద్ది చేస్తాం… జడ్చర్ల బూత్ పూర్ ఔటర్ రింగ్ రోడ్డుపై ప్రత్యేక దృష్టి సారించాం… మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలలకే మాపై ఇష్టమొచ్చిన ఆరోపణలు చేసారు… ఎవరెన్ని చేసినా మేము ఇచ్చిన హామీలను నెరవేర్చే ముందుకు వెళ్తున్నాం..

తెలంగాణ ను ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ…. ఇచ్చిన పార్టీకే పాలించే హక్కు వుంటుంది… విద్యార్థులు ఆవేదన చూడలేక సోనియమ్మ తెలంగాణ ఇచ్చింది… తెలంగాణ రాష్ట్ర అప్పల ఊబిలో చిక్కుకుపోయింది… జగన్ మోహన్ రెడ్డికి బిర్యాని పెట్టి మన నీటిని పక్క రాష్ట్రాల కు తరలించావు.. త్వరలోనే అన్ని జిల్లాల అభివృద్ది పై దృష్టి సారిస్తాం.. నిరుద్యోగులకు భవిష్యత్తులో సమస్యలు రావద్దని డీఎస్సీని పోస్ట్ ఫోన్ చేస్తే దానిపై రాజకీయం చేస్తున్నారు.. రేవంత్ రెడ్డి సీఎం కాకముందు ఎంత పోరాడినా బీఆర్ఎస్ కొడంగల్ కు నిధులు ఇవ్వలేదు… కాని ఈరోజు కొడంగల్ కు వరాల జల్లు కురుస్తోంది…. సీఎం కేసీఆర్ ను అసెంబ్లీకి ఆహ్వానిస్తున్నాం… పవర్ ప్లాంట్ లపై జరిగిన అవినీతి పై నేను మంత్రి జగదీశ్వర్ రెడ్డితో ఫైట్ చేసి నిజాలను నిగ్గు తేల్చాలని అడిగాను…. చేసిన తప్పుకు అందరూ శిక్ష అనుభ వించాల్సిందే…. రాబోయే రోజుల్లో చట్టం తన పని తాను చేసుకుపోతోంది…’ అని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి వ్యాఖ్యానించారు.