NTV Telugu Site icon

Komatireddy Venakt Reddy : ఛాంబర్‌కు వెళ్లినంత మాత్రానా పార్టీలో చేరినట్లా

Komatireddy Venkat Reddy

Komatireddy Venkat Reddy

ఛాంబర్‌కు వెల్లినంత మాత్రానా పార్టీ లో చేరినట్లా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కేటీఆర్ కూడా నా ఛైర్ దగ్గర కు వచ్చి మాట్లాడాడు..ఆయన కాంగ్రెస్ లో చేరినట్లేనా అని ఆయన వ్యాఖ్యానించారు. బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి అలాగే కలిసి ఉంటాడు , ఆయన ఎక్కడికి వెళ్లాడని, జగదీష్ రెడ్డి నేను అన్న మాటలకు ఒప్పుకున్నాడన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. త్వరలో ప్రధాని ని కలుస్తా..రాష్ట్ర రహదారుల కోసం నిధులు అడుగుతా అని, బీఆర్ఎస్ ఎత్తేసిన అన్ని వ్యవసాయ పనిముట్ల కు సబ్సిడీ ఇస్తామని, ఉప్పల్ – నారపల్లి ఫ్లై ఓవర్ కు త్వరలోనే రీ టెండర్ అని ఆయన వ్యాఖ్యానించారు. వర్షాకాలంలో ప్రయానికులకు ఇబ్బంది కలగకుండా రోడ్డు మరమ్మతులు చేపడంతామని కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి అన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎలాగో ప్రతిపక్ష నాయకుడు కుడా అంతే అని, సభకు హాజరుకాకపోవడం అంటే ప్రజాస్వామ్యాన్ని గౌరవించనట్టే అన్నారు. దేశంలో అర్ధరాత్రి వరకు సభ నడిపింది కాంగ్రెస్ ప్రభుత్వమే అని, 83 ఏండ్ల ఖర్గే,ఆరోగ్యం బాగాలేకపోయినా సోనియా పార్లమెంటుకు హాజరవుతున్నారన్నారు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి.

MESC : సినిమా టెక్నికల్ అసిస్టెంట్లకు ట్రైనింగ్.. ఎలా తీసుకోవాలంటే?

అంతేకాకుండా..’కేసీఆర్ కు ఏమైంది.. సభకు ఎందుకు హాజరవ్వడం లేదు అని, సభకు రాకపోతే కేసీఆర్ రాజకీయాలు వదులుకున్నట్లే అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ 2వసారి మళ్ళీ ప్రభుత్వ ఏర్పటు చేస్తుందని, హరీష్ రావుకి, కేటీఆర్ కి నమ్మకం లేదు బీఆర్ఎస్ పార్టీ మీద అని ఆయన వ్యాఖ్యానించారు. రేవంత్ ఆధ్వర్యంలో మేము ఎన్నికలకు వెళ్ళాము అధికారం లోకి వచ్చాము. సభలో మీకు మేము చాలు అంటున్న కేటీఆర్,హరీష్ ఎన్నికల్లో రేవంత్ ని ఎందుకు ఓడించలేదు. బుల్లెట్ దిగిందా లేదా ముఖ్యం…మా ప్రభుత్వం వచ్చిందా లేదా రాష్ట్రంలో. మేము దింపిన బుల్లెట్ కేసీఆర్ కి దిగింది… సీఎం సీటు పోయింది. కేసీఆర్ వైఖరి చూస్తుంటే ఏ క్షణమైనా బీజేపీ లో బీఆర్ఎస్ ను విలీనం చేసేటట్టు ఉన్నాడు. మహబూబ్ నగర్ జిల్లాలో ఇంటర్నల్ పాలిటిక్స్ ..అందుకే బండ్ల కృష్ణ మోహన రెడ్డి వెళ్ళాడు. త్వరలోనే మరికొంతమంది బీఆర్ఎస్ MLA లు మా పార్టీలోకి వస్తున్నారు..’ అని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

Jio Plans: జియో 3 కొత్త చౌకైన ప్లాన్‌లు.. అపరిమిత కాలింగ్, డేటాతో పాటు ఓటీటీలు కూడా..